సమంత మీడియాకు దొరికి పోయింది. ఈరోజు  శనివారం ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రంలో నటించిన అనుభవాలను చెపుతున్న, ఆమెను విలేకరులు పర్సనల్ విషయాలు చెప్పమని అడిగారు. దీని ఫై స్పందిస్తూ తను అసలు ప్రేమలో పడను అని  అనుకున్నానని,  కానీ ప్రేమ ఎంతబలమైనదో ప్రేమలో పడ్డాక తెలిసిందని చెప్పింది మన మాయలాడి.

ఇంత భావ యుక్తం గా మాట్లాడు తున్న ఆమెను  ప్రేమిస్తున్న వాడెవరు అని అడిగితే మాత్రం రెండు పెదవులను అందంగా సాగదీస్తూ ముసిముసిగా అందం గానవ్వేసింది కానీ పేరు చెప్పలేదు. అయితే తమ ప్రేమకు తమ  ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయనీ అంటూ ఇక  పెళ్లి చేసుకోవడమే మిగిలి ఉంది అని అంటోంది సమంత. అయితే  పెళ్లెప్పుడు అంటే మటుకు ఆ విషయాలన్నీ ఇప్పుడు కాదు తర్వాత చెప్తానని  మీడియా వద్దనుంచి జారుకుంది మన డైమెండ్ లెగ్ హీరోయిన్. ప్రస్తుతానికి  సమంత ప్రియ  స్నేహితుడు సిద్దూ కు ఈ వార్త ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: