పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు విజయదశమి కానుకలు ఇవ్వబోతున్నాడు. పైరసీ భూతాన్ని ఎదిరించి ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ‘ధాంక్స్ గివింగ్ మీట్’ ను రేపు భాగ్యనగరము లోని శిల్పకళా వేదికలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల క్రితమే ఈ ఫంక్షన్ ను పెడదామని ఈ సినిమా యూనిట్ మరియు పవన్ అభిప్రాయ పడినా రగిలిపోతున్న సమైఖ్య ఉద్యమ నేపధ్యంలో ఈ ఫంక్షన్ ను వాయిదా వేసారు. సీమాంధ్రలో సమ్మె బాట పట్టిన విద్యుత్ ఉద్యోగులు, టీచర్స్, ఆర్.టి.సి. ఉద్యోగులు వరుసగా సమ్మె విరమించడం జరగడంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ థాంక్స్ గివింగ్ మీట్ ను దసరా కానుకగా పవన్ తన అభిమానులకు ఇవ్వాలని నిశ్చయించు కున్నాడట.

 మరొక ఆ శక్తికర విషయం ఏమిటంటే ఎలట్రానిక్ మీడియాకి చాలా దూరంగా ఉండే పవన్ త్వరలో ఒక ప్రముఖ ఛానల్ కు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇంటర్వ్యూ ను కూడా ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు సమైఖ్య ఉద్యమం తగ్గుముఖం పట్టడం, మరో వైపు జూనియర్ ‘రామయ్యా వస్తావయ్యా’ ఘోరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకువడంతో ఇక ఎంచు మించు గా ఈ నెల అంతా పవన్ అత్తారింటికి ఎదురులేదనే చెప్పాలి. .. 

మరింత సమాచారం తెలుసుకోండి: