యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ కోసం యావ‌త్ సినీ అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అంద‌రూ ఈ మూవీ అత్తారింటికిదారేది మొద‌టి రోజు క‌లెక్షన్స్‌ను బీట్ చేయ‌డం ఖాయం అని గ‌ట్టిగానే న‌మ్మారు. కాని రామయ్యవ‌స్తావ‌య్యా మూవీ మొద‌టిరోజే డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అయితే మొద‌టి రోజు కలెక్షన్స్ ఎంత వ‌చ్చాయో తెలిస్తే ఆ మూవీ ఏ రేంజ్‌లో ఆడుతుందో ఇట్టే క‌నిపెట్టేయ‌చ్చు. అంద‌రూ కూడ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మూవీపై వ‌స్తున్న టాక్స్‌ను ప‌క్కన పెట్టి, మొద‌టి రోజు క‌లెక్షన్స్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. కాని ఇప్పటి వ‌ర‌కూ రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీకు సంబంధించిన మొద‌టి రోజు క‌లెక్షన్స్ వివ‌రాలను అఫిషియ‌ల్‌గా అనౌన్స్ చేయ‌లేదు క‌దా, దానికి సంబంధించిన వివ‌రాలు కూడ ఎక్కడా క‌నిపించ‌డంలేదు. ఇంత‌కీ మొద‌టి రోజు క‌లెక్షన్స్‌ను దిల్‌రాజు ఎందుకు బ‌య‌ట‌కు చెప్పడంలేదో ఎవ్వరికి అర్ధంకాని విష‌యం.

ఇండియ‌న్ బాక్సాపీస్ క‌లెక్షన్స్‌ను చెప్పే త‌రుణ్ ఆద‌ర్శ్ కూడ టాలీవుడ్ హై ఎక్స్‌పెక్టేష‌న్స్ రామ‌య్యా వ‌స్తావ‌య్యా మూవీకు సంబంధించిన ఎటువంటి క‌లెక్షన్స్ వివ‌రాల‌ను చెప్పడంలేదు. అమెరికాలో 120 స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన రామయ్యవ‌స్తావ‌య్యా మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ ఎంత అన్నది కూడ స్పష్టత రాలేదు. మొత్తానికి యంగ్ టైగ‌ర్ లేటెస్ట్ మూవీకు మొద‌టి రోజు క‌లెక్షన్స్ గ‌ల్లెంత‌య్యాని, వాటి వివ‌రాలు ఎంత అన్నది ఎందుకు స‌స్పెన్స్‌గా ఉంచుతున్నారో ఇంకా తెలియాల్సింది.

మరింత సమాచారం తెలుసుకోండి: