పవన్ కళ్యాణ్ ను రేనుదేశాయ్ ప్రేమిస్తూనే ఉందని, వారి బందంలో బేదాభిప్రాయలు లేవని స్పష్టమయిందంటున్నారు. రేను దేశాయి- పవన్ ల మద్య ప్రేమ అందరికి తెలిసిందే. వారి పెళ్లి కూడా ఓ సంచలనమే. ప్రస్తుతం వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

అయితే పవన్ కు రేనుకు మద్య విభేదాలు వచ్చి విడిపోయారని, విడాకులు కూడా తీసుకున్నారన్న వదంతులు పుట్టుకొచ్చిన విషయం అందరికి తెలిసిందే. పైగా వారు గత కొంతకాలం నుంచి వేర్వేరుగానే ఉంటున్నారని కూడా అంటున్నారు. అయితే ఈ వ్యవహారంపై మెగా కుటుంబం మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.

రేను దేశాయి ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై తనే ఓ మరాఠి సినిమాను డైరెక్టు చేస్తోంది. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ తాను ఏది చేసినా ముందు పవన్ కు చెప్పి చేస్తాను, చెప్పకుండా ఏది చేయను అంది.  ఏమైనా తప్పులుంటే సరిదిద్దుతాడు, అవసరమైన సలహాలు ఇస్తాడు అని పేర్కొంది. అంటే వారి మద్య ఇంకా ప్రేమ అలాగే ఉందని, బయటకు వచ్చినవన్ని పుకార్లే అన్న విషయం దీంతో స్పష్టం అయిందంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: