టాలీవుడ్ లో తన అందాలు,నటనతో అందరి మతులు పోగొట్టి, మనసులు దోచుకున్న స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందట. దీనికి కుటుంబ సభ్యులు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం. సరైన జోడిని వెతికి పట్టుకోవడంలో వారు బిజీ గా ఉన్నారట.

కాదా మరి ఎందరో స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే సినిమాలు పోతాయని, ఆడియన్సే కాదు, సినిమా తీసేవాళ్లు కూడా పెళ్లి చేసుకున్న వారి వైపు చూడరని భావించి వయసంతా అయ్యాక వరుడు దొరక్క అలాగే మిగిలి జీవితం కోల్పోయిన వారు కొందరయితే, మరికొందరు రెండో భార్యగా వెల్లి చిక్కుల్లో పడ్డవారున్నారు.

ఇదంతా తెలిసి కూడా నేటి తరం వారు ఆపొరపాటు చేస్తారా.. చెప్పండి, ఎందుకంటే హన్సిక అప్పడే చూసుకుంది, సమంత అదే పని చేసింది,  వారికంటే పెద్దదయిన అనుష్క ఇప్పటికి కళ్లు తెరవక పోతే ప్రమాదమే కదా అనుకుందని సమాచారం. ఎందుకంటే ఆమె వయసు ఇప్పుడే 30 ఏళ్లంటున్నారు, ఇంకా ఆలస్యం చేస్తే... ఊహించుకోవడమే కష్టమని పెళ్లికి రెడీ అయింది అంటున్నారు. అయితే ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది, అందుకే ఎంత తొందర పడ్డా...మరో సంవత్సరం పడుతుందేమో... అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: