మొన్నటి వ‌ర‌కూ ఫుల్ జోష్‌లో ఉన్న స‌మంత‌ను ఓ హీరో డిస్పప్పాయింట్ చేశాడు. అత్తారింటింకిదారేది మూవీ స‌క్సెస్ కేవ‌లం రెండు వార‌ల ముచ్చట‌గానే త‌న‌కు మిగిలింది. అంద‌రూ అనుకున్నట్టు అత్తారింటికిదారేది, రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీల‌తో స‌మంత బ్లాక్‌బ‌స్టర్ హీరోయిన్‌గా మారుతుంద‌నుకున్నారు. కాని ఆ ఆశ‌లు ఆడియాశ‌లు అయ్యాయి. రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ స‌క్సెస్‌పై స‌మంత సంతోషంగా లేద‌ని టాలీవుడ్ చెబుతుంది. మూవీ రిలీజ్ త‌రువాత త‌న ట్విట్టర్లో మూవీ గురించి ఒక్క ట్వీట్ కూడ‌ చేయ‌లేదు. 

కాని అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన‌ రిలీజ్ నుండి క‌లెక్షన్స్ వ‌ర‌కూ ప్రతిదాని గురించి ట్విట్టర్లో అప్‌డేట్స్‌ను ఇస్తూ అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ వ‌చ్చింది. కాని ఎన్టీఆర్ మూవీ గురించి ఇప్పటి వ‌ర‌కూ  ఒక్క స‌క్సెస్ అప్‌డేట్ కూడ ఇవ్వలేదు. వీట‌న్నింటికి ప‌క్కకు ప‌డితే, రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ స‌క్సెస్ అంటూ స‌మంత‌ను ఏ సెల‌బ్రిటి కూడ విష్ చేయ‌లేదు. దీంతో టాలీవుడ్‌లో ఏం జ‌రుగుతుందో స‌మంత‌కు అర్ధం అయింది. ఈ మూవీ ఎఫెక్ట్ త‌న మీద ప‌డ‌కుండా ముందుగా  జాగ్రత్తలు తీసుకుంటుంది. 'అత్తారింటికి దారేది, రామ‌య్యవ‌స్తావ‌య్యా బ్లాక్ బ‌స్టర్ హిట్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఆ హీరోల‌కు నా థ్యాంక్స్ అంటూ త‌నే ట్వీట్ చేసింది'. త‌ను అంత భారీగా ట్వీట్ ఇచ్చినా, ఆ ట్వీట్‌కు రెస్పాన్స్ కూడ క‌రువ‌య్యాంది. స‌మంత ట్వీట్‌ను ఎవ్వరూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఈ బ్యూటి ఇంకా డిస్సప్పాయింట్ అయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: