ఎవరైనా సినిమా చేస్తే, ప్రేక్షకులు దాన్ని చూసి ఏమంటారా అని చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తుంటారు. సినిమా విడుదలై, జనం రెస్పాన్స్ తెలిసేవరకూ టెన్షన్ పడుతుంటారు. కానీ మంచు ఫ్యామిలీ ఆ టైపు కాదు. తమ సినిమాకి వాళ్లకి వేరేవాళ్ల స్పందన అక్కర్లేదు. వాళ్లకి వాళ్లే డిసైడ్ చేసేస్తారు సినిమా ఎలా ఉంటుందో.

తాజాగా విష్ణు నటించిన దూసుకెళ్తా సినిమా గురించి, ఆ చిత్ర నిర్మాత విష్ణు తండ్రి అయిన మోహన్ బాబు మాట్లాడారు. ఆ సినిమా గురించి ఆయన చెప్పే మాటలు వింటే కచ్చితంగా పిచ్చెక్కుతుంది. మోహన్ బాబు తన కొడుకుని, ప్రత్యేక పాత్రలో చేసిన కూతురిని ఆకాశానికి ఎత్తేశారు. వీరు పోట్ల టేకింగ్, రవితేజ వాయిస్ ఓవర్ ఆ సినిమాకి ఎంత ప్లస్సో... విష్ణు పర్ ఫార్మెన్స్, మంచు లక్ష్మి పాత్ర ఆ సినిమాకి మరీ ప్లస్ అట. ముఖ్యంగా లక్ష్మి రోల్ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అందరికీ తెగ నచ్చేస్తుందట.

సినిమా ఎలా ఉంటుందన్నది అందరూ చెబుతారు. అది మామూలే. ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే జయాపజయాలను తట్టుకోవడం కష్టం. కానీ ఇంట్లోవాళ్లు ఇంట్లోవాళ్లను పొగిడేసుకోవడం చూస్తే కాస్త వెరైటీగానే అనిపిస్తుంది. జనాలు అలానే ఫీలయ్యారు. వాళ్ల డబ్బాలు వాళ్లే కొట్టేసుకోవడం ఏంటి, మనం కదా ఇవన్నీ చెప్పాల్సింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయినా వాళ్లు పెద్ద పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరో మంచు వారి సినిమాలకు సంబంధించిన ఏ ఫంక్షన్, ఏ ప్రెస్ మీట్ చూసినా అర్థమైపోతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: