వినోదం కోసం ఒకప్పుడు ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ పెట్టేవారు సినిమాల్లో. కానీ రాను రాను కామెడీని సినిమాల్లో సందర్భతోచితంగా కలిపేయడం అలవాటయ్యింది. ప్రత్యేకంగా లేకుండా జరిగే కథలోని సన్నివేశాలను బట్టే కామెడీని పుట్టిస్తున్నారు. ఇది కమెడియన్ల పాలిట వరమయ్యింది. వాళ్ల మీద ఆధారపడి సినిమాలు తీసే దర్శకులకు కొదవే లేదు.

అయితే హరీశ్ శంకర్ కామెడీని లైట్ తీసుకున్నాడని రామయ్యా వస్తావయ్యా సినిమా చూస్తే అర్థమవుతుంది. కథలో బలం లేకపోయినా, కథనంలో కొత్తదనం లేకపోయినా... కొన్నిసార్లు కామెడీ సినిమాని నిలబెట్టేస్తుంది. ఆ విషయాన్ని స్వయంగా చూసి కూడా హరీష్ కామెడీని

తక్కువ అంచనా వేశాడు. రామయ్యాలో అంత గొప్ప కామెడీ లేదు. చెప్పాలంటే అసలు పెద్ద కమెడియన్సే లేరు. ఏదో కొద్దిగా కామెడీ ఉన్నా... అది కూడా ఉండాలి కాబట్టి పెట్టినట్టుగా ఉంది తప్ప పెద్దగా పండలేదు.
సినిమా బాలేదని అనిపించుకోవడంతో అందరూ హరీశ్ ని నానా మాటలూ అంటున్నారు. ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యమైన కామెడీ లేకుండా చేసినందుకు ఆడేసుకుంటున్నారు. ఇండస్ట్రీలో పలువురు కమెడియన్లు కూడా రామయ్య పోయినందుకు పండుగ చేసుకుంటున్నారని సమాచారం. దూకు డు, బాద్ షా లాంటి సినిమాలు కామెడీ వల్లే హిట్టయ్యాయని తెలిసి కూడా, తన సినిమాలో తమకు అవకాశం లేకుండా చేసి ఓవరాక్షన్ చేసినందుకు బాగా అయ్యింది అని కొందరు పెద్ద కమెడియన్లు సైతం కామెంట్ చేస్తున్నారట. మొత్తానికి హరీష్ ఓవర్ కాన్ఫిడెన్స్ అతడిని నిలువునా ముంచెయ్యడమే కాదు, అందరికీ లోకువ కూడా చేసేసిందన్నమాట! 

మరింత సమాచారం తెలుసుకోండి: