అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న మాట అతడికి బాగా సరిపోతుంది. తండ్రి ఓ పెద్ద నిర్మాత. టాప్ హీరోలతో సూపర్ హిట్స్ తీసిన చరిత్ర ఆయనది. ఆయన వారసుడిగా నటప్రవేశం చేశాడు. కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. దెబ్బకి జడుసుకుని పక్కకు వెళ్లిపోయాడు. కానీ ఇప్పడు డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తానని అంటున్నాడు. ఆ విక్రమార్కుడు ఎవరో కాదు... కె.ఎస్.రామారావు తనయుడు వల్లభ్.

 ఎవరే అతగాడు చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు వల్లభ్. కానీ అతడి నటన ఎవరికీ నచ్చలేదు. దాంతో మనోడు బ్యాక్ టు పెవిలియన్ అంటూ వెనక్కి పరుగెత్తాడు. చాలా కాలం కావడంతో అతడిని చాలామంది మర్చిపోయారు. గుర్తున్నవాళ్లేమో అతడిక సినిమాల జోలికి రాడు అని అనుకున్నారు. కానీ వల్లభ్ ఊరుకోలేదు. మెగాఫోన్ పట్టుకుని మరీ బయలుదేరాడు రీ ఎంట్రీకి. అమృతంగమయ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అందులో హీరో కూడా అతడే. నిన్ననే ఈ సినిమాకి కొబ్బరి కాయ కొట్టారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

 తన రీ ఎంట్రీ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వల్లభ్. ఇది చాలా మంచి కథ, చాలా డిఫరెంట్ గా ఉంటుంది, నాకు మంచి పేరు తెస్తుంది అంటున్నాడు. నాకు మరో అవకాశం ఇచ్చినందుకు మా డాడీకి రుణపడి ఉంటాను అని కూడా అంటున్నాడు. ఇంతకీ ఈయనగారికి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చింది అతడి తండ్రే అన్నమాట. పుత్రుడి ప్రేమతో ఆయన ఈ సినిమాని నిర్మిస్తున్నట్టున్నాడు. కానీ ప్రేక్షకుల పరిస్థితి ఏంటో సినిమా రిలీజయ్యాక చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: