మిగతా పరిశ్రమలతో పోలిస్తే టాలీవుడ్లో హీరోల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంటుంది. ఫ్యాన్స్ మధ్య పోటీ ఉంటుందేమో కానీ హీరోల మధ్య ఎప్పుడూ ఉండదు. చాలామంది హీరోల మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అలాంటివారిలో బాలయ్య, పవన్ కళ్యాణ్ లు కూడా ఉన్నారు. 

 బాలయ్య, పవన్ ల మధ్య మంచి ర్యాపో ఉంటుందని, ఇద్దరి సాన్నిహిత్యం బలమైనదని అందరూ అంటూ ఉంటారు. వారి బంధం చాలాసార్లు బయటపడింది కూడా. అందుకేనేమో... అత్తారింటికి దారేది సినిమాని ప్రత్యేకంగా చూశాడు బాలయ్య. చూసినప్పటి నుంచి పవన్ ని తెగ పొగిడేస్తున్నాడు. సినిమా సూపర్బ్ గా ఉందని, పవన్ అయితే చించేశాడని తన స్టయిల్లో చెప్పేస్తున్నాడు. అతడికి సినిమా నిజంగా నచ్చిందా, పవన్ మీద అభిమానంతో ఇలా ఎత్తేస్తున్నాడా అని కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే బాలయ్య మాటలు మాత్రం నిజాయతీగానే అనిపిస్తున్నాయి.

 గతంలో పవన్ కళ్యాణ్ కూడా బాలయ్యను ఎక్కడికో ఎత్తేశాడు. శ్రీరామరాజ్యం సినిమా చూసి బాలయ్య సూపర్ అన్నాడు. అలాంటి సినిమాలు బాలయ్య తప్ప మరెవరూ చేయలేరని కూడా చెప్పేశాడు. ఇప్పుడు రివర్స్ లో బాలయ్య పవన్ ని ఎత్తేస్తున్నాడు. చూస్తుంటే... ఇవన్నీ పై పై పొగడ్తలలా లేవు. ఎందుకంటే పవన్ ఊరికే ఎవరినో కావాలని ఎత్తేయడం ఎప్పుడూ కనిపించదు. కాబట్టి అతడు సిన్సియర్ గానే అని ఉంటాడు. ఇప్పుడు బాలయ్య ఆ కృతజ్ఞతను చూపిస్తున్నట్టున్నాడేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: