మన టాప్ హీరోలు లేదా డైరెక్టర్ల పిల్లలు అదే రంగంలో హీరోల గానో లేదంటే నిర్మాతలగానో సినిమా రంగం లో సెటిల్ అవ్వడం చూస్తున్నాం. కానీ క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం టాప్ హీరోయిన్ సుహాసినీల కొడుకు నందన్ డిఫరెంట్ గా తయారు కావడం అందరిని ఆచ్యర్యపరుస్తోంది. ప్రస్తుతం చెన్నై లో 12th స్టాండర్డ్ చదువుతున్న నందన్ కు తన తల్లి లా కానీ , తండ్రి లా కానీ సినిమా రంగంలో సెటిల్ అవ్వడం ఇష్టం లేదట. తనకు రాజకీయాల లోకి వెళ్ళి ప్రజాసేవ చేయాలని నందన్ కోరికట. అదీకాకుండా మార్కిస్ట్ సిద్ధాంతాల వైపు నందన్ ఆకర్షింప పడుతూ 24 పేజీల పుస్తకాన్ని లెనినిజం పై తాయారుచేసి కమ్యునిస్ట్ పార్టీ నాయకులకే నందన్ బుక్ వ్రాసి ఇవ్వడం కోలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.

ఈ విషయం తెలుసుకున్న నందన్ తాత కమలహాసన్ కూడా నందన్ ను తన చదువు అయిపోయిన తరువాత రాజకీయాలలో ప్రవేసిద్దువుగాని అని అంటూ సలహా ఇవ్వడమే కాకుండా తన తండ్రి మణిరత్నం వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల విషయం ఆలోచించమని చేపెతున్నాదట. ఇంతకీ నందన్ ఏ మార్గం ఎంచుకుంటాడో చూడాలి మరి...

మరింత సమాచారం తెలుసుకోండి: