నిన్న భాగ్యనగరం లో జరిగిన పవన్ అత్తారిల్లు థాంక్స్ గివింగ్ మీట్ చిరంజీవి కి షాక్ గా మారిందని టాలీవుడ్ విమర్శకులు అంటున్నారు. ఎంతో భయ పడుతూ రాజకీయ ఉద్యమాల నేపధ్యం లో వచ్చిన అత్తారిల్లు ఇంత ఘన విజయం సాధిస్తుందని పవన్ కూడా ఊహింఛి ఉండడు. అందరి అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా మారినపవన్ ‘అత్తారిల్లు’ విజయోత్సాహ సభలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చాలా మందిని ఆచ్యర్యపరిచాయి.

సామాన్యం గా మెగా కుటుంబ ఫంక్షన్స్ లో చిరంజీవి ప్రస్తావన లేకుండా జరగవు. ముఖ్యంగా పవన్ తన సినిమాలకు సంభందించిన సభలలో చిరంజీవి ప్రస్తావన గతంలో తరుచూ చేస్తూ ఉండేవాడు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలలో ఓడిపోయి కాంగ్రెస్ లో కలిసిపోయిన తరువాత పవన్ తన సినిమాలకు సంబంధించిన సభలలో చిరంజీవి ప్రస్తావన తగ్గించేసుకున్నాడు. అదేవిధంగా నిన్న జరిగిన సక్సస్ మీట్ లో కూడా పవన్ మాత్రమే కాదు ఆ సభలో పాల్గొన్న ఏ వ్యక్తీ చిరంజీవి ప్రస్తావన తీసుకురాకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంతేకాదు ఈ సభకు వచ్చిన పవన్ అభిమానులు కూడా ఏ సందర్భంలోనూ చిరంజీవి ప్రస్తావన తీసుకురాలేదు.

దీనినిబట్టి చూస్తే ఇప్పటి వరకు మెగా అభిమానులుగా ఉన్న అభిమానులలో ఒక వర్గం పవన్ అభిమానులుగా మరొక వర్గం మెగా అభిమానులుగా మిగిలిపోయే రోజులు భవిష్యత్తులో రానున్నాయి అని చెప్పడానికి సంకేతంగా పవన్ చిరంజీవి ఇమేజ్ ముసుగు నుండి పూర్తిగా బయటకు వచ్చి తనకంటూ ఒక పరిపుర్ణమైన స్థానం టాలీవుడ్ లో ఏర్పరుచుకోవడానికి నిన్న జరిగిన సభ ఒక తొలి మెట్టుగా అనుకోవాలి అంటూ విమర్శకులు విశ్లేషిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చిరంజీవికి గట్టి షాక్ ను కలిగించేవిగా ఉన్నాయి అంటు టాలీవుడ్ లో కధనాలు వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: