ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన‌ ప్రి రిలీజ్డ్ లీక్డ్ వీడియోపై ప‌లు అనుమానాల‌ను ప‌వ‌న్ వ్యక్తప‌రిచాడు. 'పోలీసులు ప‌ట్టుకున్నది మామూలు వ్యక్తుల‌ను, వాళ్ళను ప్రోత్సహించింది ఇంకొరు. వాళ్ళేవ‌రో మాకు బాగా తెలుసు. వారికి న్యాయం చేకూరేలా ప్రయ‌త్నిస్తాం' అని పేర్లు బ‌య‌ట‌కు చెప్పక‌పోయినా, వార్నింగ్‌ను మాత్రం స్ట్రాంగ్‌గా ఇచ్చాడు. ప‌వ‌న్‌కి ప్రత్యుర్ధులు ఉంటారా అనే డౌట్ నిన్నటి థ్యాంక్యూ మీట్‌లో వెల్లడైంది. ఇది ప‌వ‌న్‌పై కోపంతో చేసిందా, మెగా ఫ్యామిలీ యూనిటిను తూట్లు పొడ‌వాల‌ని చేసిందా అనే ఆలోచ‌న‌లు టాలీవుడ్‌లో చ‌క్కెర్లు కొడుతున్నాయి.

ఇంత‌కీ అత్తారింటికిదారేది మూవీను లీక్ చేసింది ఎవ‌రో అంద‌రికి తెలిసిపోయింది. ఎంతో కాన్ఫిడెన్షియ‌ల్‌గా ఉండే ఈ మేట‌ర్‌ ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. ప‌వ‌న్‌ను టార్గెట్ చేసుకొని, అత్తారింటికిదారేది మూవీను ఎంత వీలైతే అంత న‌ష్టప‌ర‌చాల‌ని కుట్రప‌న్నిన‌ ఆ వ్యక్తుల పేర్లు టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓపెన్ అయ్యాయి. మొత్తంగా ఇందులో న‌లుగు వ్యక్తులు కీల‌కంగా ఉన్నార‌ని తెలిసింది టాలీవుడ్ స‌మాచారం. వీరిలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నార‌ని తెలియ‌డంతో, ఎవ‌రూ దీని గురించి పైకి మాట్లాడానికి ఆస‌క్తి చూప‌డంలేదు. ఇండ‌స్ట్రీలోని రెండు బ‌ల‌మైన వ‌ర్గాల మ‌ధ్య ఇప్పుడు ఆస‌క్తిక‌రమైన పోటీ జ‌రుగుతుండంతో, ఏ క్షణం ఏం జ‌రుగుతుందోన‌ని ఎవ్వరికీ అర్ధంకాకుండా ఉంది. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏవిధంగా ముందుకు వెళ‌డ‌నేది కీల‌కంగా ఉంది. ఏదేమైనా ప‌వ‌న్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ప‌వ‌నిజం అనే బ‌ల‌మైన అండ శ్రీరామ‌ర‌క్షగా ఉంటుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: