సంచ‌ల‌నం అవుతున్న అత్తారింటికిదారేది లీక్డ్ మూవీ కుట్రలో టాలీవుడ్‌లోని ప‌లు ప్రముఖ‌ల పేర్లు విన‌పడుతున్నాయి. సోషియ‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్‌లో అయితే దీనికి సంబంధించిన పేర్లను కూడ బ‌య‌ట‌కు చెప్పేస్తున్నారు. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా చెప్పినా, అస‌లు వారు ఎవ‌ర‌న్ని మాత్రం కొంత మందికే తెలుసు. వాళ్ళు ఎవ‌ర‌ని మీడియాకు గాని, బ‌య‌ట వ్యక్తుల‌కు గాని ఖ‌చ్ఛితంగా తెలియ‌ద‌ని కొంద‌రు అంటున్నారు. అయితే పైకి వినిపించే పేర్లలో మెగాఫ్యామిలి నుండి అబ్భాయ్ చ‌ర‌ణ్ పేరు కూడ విన‌ప‌డుతుంది. 

ఎవ‌డు మూవీకు అడ్డుగా ఉన్నందుకే ఈ విధ‌మైన ప‌నిని వేరే ర‌కంగా చేసి ఉండ‌వ‌చ్చని కొంత మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఆలోచించ‌డం అనేది ప‌ర‌మ ప‌నికిమాలిన ప‌ని టాలీవుడ్ ఇండ‌స్ట్రీ అంటుంది. ఇటువంటి ప‌నిని మెగాఫ్యామిలికు సంబంధించిన ఎవ‌రూ కూడ చేసివుండ‌రు. ఎవ‌రో మెగ‌ప్యామిలికి అత్యంత స‌న్నిహితులుగా ఉంటూ వెన్నుపోటు పొడిచారు అనేది టాలీవుడ్ ఓపెన్ టాక్‌. 

ఇందులో ప్రధానం ప్రొడ్యూజ‌ర్ రాజు పేరు విన‌ప‌డుతుంది. అత్తారింటికిదారేది నైజాం డిస్ట్రిబ్యూష‌న్‌లో రాజుకి నితిన్ పోటీగా రావ‌డంతో, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్‌లో రాజు పేరు విన‌ప‌డుతుంది. కాక‌పోతే ఇవ‌న్ని సినీ అభిమానుల ఊహాగానాలే త‌ప్ప అస‌లైన కుట్ర దారుడు ఎవ‌ర‌నేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి ప‌వ‌న్ అస‌లు విష‌యం చెప్పకుండా, చివ‌రిలో క్వశ్ఛన్ మార్క్ పెట్టడంతో ఆ వ్యక్తుల ఎవ‌ర‌యి ఉంటార‌నేది ఇప్పుడు ఇండ‌స్ట్రీ టాక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: