అందం, ఆకర్షణ మెండుగా ఉన్న ముద్దుగుమ్మ ప్రణీత. కాకపోతే ఆమెకున్న ప్రత్యేకతలను గుర్తించడానికి సినిమావాళ్లకే కాస్త సమయం పట్టింది. వాళ్లు గుర్తించిన మరుక్షణం ఆమె పవన్ కళ్యాణ్ పక్కనుంది. ఆ ఆనందం ఆమెను నిలువనీయడం లేదు.

పవన్ పక్కన చాన్స్ రావడమంటే... క్యాంపు క్లర్కుకి కలెక్టర్ గా ప్రమోషన్ వచ్చినట్టే. అందుకే ప్రణీత ఎగిరి గంతేసింది. దానికి తోడు అత్తారింటికి దారేది చూసినవాళ్లంతా సమంత కంటే ప్రణీతే బాగుందని అనడం ఆమెని మరింత సంతోషపెడుతోంది. తన ప్రయత్నం తాను చేసింది కానీ ఇన్ని ప్రశంసలు వస్తాయని ఆమె కూడా ఊహించలేదు మరి. మంచి ఆఫర్లు వస్తున్నాయి, కానీ ఆలోచించి ఓకే చేస్తాను అంటోంది. నటిగా ఇప్పుడు శాటిస్ ఫై అయ్యావా అంటే మాత్రం ఓ చిత్రమైన సమాధానం చెప్పింది.

హిట్ సినిమాలు చేయడం సంతోషమేనట. కానీ నిజానికామె చిన్న చిన్న వాటికే చాలా సంతోషపడిపోతుందట. ఎక్కడైనా బయటకు వెళ్లినప్పుడు మీరు ఫలానా సినిమాలో నటించారు కదా అంటే చాలు, చెప్పలేని సంతోషంగా సంతృప్తిగా ఉంటుందట. అయితే మీరు బయటకు బాగానే వెళ్తుంటారన్నమాట అని చిలిపిగా అడిగితే... అంత లేదు, పార్టీలకవీ వెళ్లను, తీరిక దొరికితే ఇంట్లోనే ఉంటాను, ఎప్పుడైనా షాపింగుకు వెళ్తాను అంటూ వెంటనే కవర్ చేసేసింది. దీనివల్ల మనకో విషయం అర్థమైంది. ప్రణీతను సంతోషపెట్టడం, శాటిస్ ఫై చేయడం చాలా ఈజీ అన్నమాట!

మరింత సమాచారం తెలుసుకోండి: