ఎన్టీఆర్ కెరియర్ లో భయంకరమైన ఫ్లాప్ గా రికార్డు క్రియేట్ చేసుకున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా ప్లాప్ టాక్ తో నడుస్తున్నా ఈ సినిమా విజయవంతం అయింది అంటూ, నిన్న నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమా సక్సస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. రామయ్య సినిమా 35 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే అప్పుడే కేవలం నాలుగు రోజులలోనే ఈ సినిమా 20 కోట్లు వసూలు చేసింది అంటూ దిల్ రాజ్ చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇక దర్శకుడు హరీష్ శంకర్ అయితే ఈ సినిమాలో అమ్ములు పాత్రలో నటించిన సృతిహాసన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించేసాడు. ఈ పాత్రను శ్రుతి మినహా మరెవరు చేయలేరని కూడా దిల్ రాజ్ కితాబ్ ఇచ్చేసాడు.

ఈ సక్సస్ మీట్ కు హీరో ఎన్టీఆర్ కానీ, హీరోయిన్ సమంత కానీ రాకుండా కేవలం శ్రుతి మాత్రమే హాజరవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. సినిమా పరాజయం చెందినంత మాత్రాన ఈ సినిమా పబ్లిసిటీ బాధ్యత నుండి జూనియర్ తప్పించు కోవడం అనేక ఉహగానాలకు అవకాసం ఇచ్చింది . గతంలో దిల్ రాజ్ నిర్మాణంలో హిట్ సినిమాలు నటించిన జూనియర్ ఒక్క ఫ్లాప్ తోనే మొహం చాటువేయడం మీడియాకు అనేక అనుమానాలకు తావిచ్చింది. అదేవిధంగా ఇప్పటి వరకు డైమండ్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత కూడా ఈ మీడియా మీట్ కు మొహం చాటువేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

సినిమా టైటిల్ కు కధకు సంబంధం లేకపోవడం వల్ల ఈ సినిమా పరాజయం చెందింది అని దిల్ రాజ్ లాంటి అనుభవము ఉన్న నిర్మాత చెప్పడం ఆశ్చర్యకరం. జూనియర్ సమంతలు రాకపోయినా శ్రుతిహాసన్ ఈ మీడియా మీట్ కు వచ్చి ఫ్లాప్ సినిమాను ప్రమోట్ చేయడానికి తనవంతు ప్రయత్నంచేసింది. కొసమెరుపు ఏమిటంటే ప్రస్తుతం రామయ్యా వస్తావయ్యా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పవన్ అత్తారింటికి దారేది సినిమా మూడోవ వారం కలెక్షన్స్ లో కనీసం సగం కూడా లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది...

మరింత సమాచారం తెలుసుకోండి: