ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో సారి విజృంభించాడు. అబ్బాయ్ న‌టించిన మ‌గ‌థీర మూవీ క‌లెక్షన్స్‌ను అవ‌లీల‌గా దాటేశాడు. రామ్‌చ‌ర‌ణ్ మ‌గ‌ధీర క‌లెక్షన్స్ నైజాం ఏరియాలో ఇర‌వై కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసింది. ఈ రికార్డ్‌ను అత్తారింటికిదారేది మూవీ అవ‌లీల‌గా దాటేసింది. కేవ‌లం ఇర‌వై రోజుల్లో మ‌గ‌ధీర క‌లెక్షన్స్‌ను అత్తారింటికిదారేది మూవీ క్రాస్ చేసింది.

నైజాం ఏరియాలో లేటెస్ట్‌గా అత్తారింటికిదారేది మూవీ ఇర‌వై కోట్ల రూపాయ‌ల‌ క‌లెక్షన్స్‌ను దాటింది. దీంతో మ‌గ‌ధీర రికార్డు బ‌ద్దలైన‌ట్టే. నైజాం ఏరియాలో ఇర‌వై కోట్లను మించి క‌లెక్షన్స్‌ను వ‌సూల్ చేసిన‌ చిత్రంగా అత్తారంటికిదారేది మూవీ నిలిచింది. ఇప్పటి వ‌ర‌కూ ఈ మూవీ ప్రపంచ‌వ్వాప్తంగా డెబ్బై కోట్ల క‌లెక్షన్స్‌ను కొల్లకొట్టింది. ఒక తెలుగు సినిమా వంద కోట్లను అవ‌లీల‌గా క‌లెక్ట్ చేయ‌గ‌ల‌ద‌ని ప‌వ‌న్ మూవీతో నిరూపితం కాబోతుంద‌ని టాలీవుడ్ బాక్సాపీస్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: