అత్తారింటికి దారేది సినిమా కు దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ అన్నది నూటికి నూరు పాళ్ళు నిజం. కానీ ఈ ఘనవిజయం వెనుక దర్శకత్వం విషయంలో పవన్ హస్తం కూడా ఉంది అని ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ ఒక విషయాన్ని తెలియచేసారు. ఫైట్స్ ను కంపోజ్ చేయడం, డాన్స్ లను కంపోజ్ చేయడం, స్క్రిప్ట్ వ్రాయడం, పాటలు పాడటం తో పాటు పవన్ దర్శకత్వం వహిస్తాడు అన్న విషయం అందరకి తెలిసిందే. చాల సంవత్సరాల క్రితం పవన్ ‘జాని’ సినిమాకు దర్శకత్వం వహించాడు ఆ తరువాత వచ్చిన ‘గుడుంబా శంకర్’ సినిమా విషయంలో కూడా పవన్ హస్తం ఉంది అంటారు. ఇవన్నీ ఒకనాటి సంగతులు లేటెస్ట్ గా విడుదలైన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు పవన్ దర్శకత్వం చేసాడట.

ఈ సినిమాలో అత్తగా నటించిన నదియా పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేడప్పుడు సరిగ్గా తెలుగు పలకడం రాక ఆమె పాట్లు చూసి త్రివిక్రమ్ సెట్ మీద తెగ నవ్వేవాడట, దానితో కోపం వచ్చిన నదియా త్రివిక్రమ్ సెట్ లో ఉంటే తాను నటించలేక పోతున్నాను అంటూ పవన్ కు తన బాధ చెప్పుకుంటే పవన్ వెంటనే స్పందించి త్రివిక్రమ్ ను ఆ సీన్ చిత్రీకరణ నుండి బయటకు వెళ్ళిపోమని చెప్పి తానే మెగా ఫోన్ పట్టుకుని చిత్రీకరించాడట. అదేవిధంగా పవన్ ఒక సన్నివేశంలో ఎన్ని సార్లు చేస్తున్నా త్రివిక్రం మళ్ళీ రీటేక్ లు అడగడంతో అప్పుడు కూడా పవన్ త్రివిక్రమ్ ను బయటకు పంపి తన షాట్ ను తానే దర్శకత్వం వహించుకుని చిత్రీకరించుకున్నాడట. ఈ విషయాలన్నీ త్రివిక్రమ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రస్తుతం పవన్ హవా బాగుంది కాబట్టీ ‘గబ్బర్ సింగ్’ సీక్వెల్ లోకూడా పవన్ ఇటువంటి ప్రయోగాలు చేస్తాడనే అనుకోవాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: