నేను మితిమీరి ఎక్స్ పోజ్ చేయను, బికినీ అస్సలు వేయను అంటూ ఆ మధ్య స్టేట్ మెంట్ ఇచ్చింది తమన్నా. కొందరు ఆమెతో బికినీ వేయిద్దామని తెగ ట్రై చేసినా అమ్మడు ఒప్పకోలేదట. అంతేకాదు, ఇంటిమేట్ సీన్ల విషయంలో కూడా బోలెడన్ని హద్దలు పెట్టింది మేడమ్. లిప్ లాకులా... నో వే అనేసింది. కానీ ఇప్పుడామె నోటి నుంచి ఆ సమాధానం రావడం లేదు. 

బాలీవుడ్ మీద ఉన్న మోజు కారణంగా తెలుగు పరిశ్రమకు కూడా దూరమయ్యింది తమన్నా. అలా అని అక్కడ పొడిచిందేమీ లేదు. అవకాశాలు రావడం లేదు. దాంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యింది ఆమె పరిస్థితి. దాంతో అవసరమైన కట్టుబాట్లు, పంతాలకు పోవడం అనవసరం అనుకుందో ఏమో... ఇన్నాళ్లూ పాడిన 'నో వే' అన్న పాటకు ఇప్పుడు స్వస్తి చెప్పేసింది. ఇటీవల ఓ దర్శకుడు ఆమెకు కథ చెప్పడానికి వెళ్లి, సినిమాలో కొద్దిగా రొమాన్స్ ఉంటుంది, ఒక లిప్ లాక్ కూడా పెట్టాలనుకుంటున్నా అంటే... సినిమాకి అవసరమైతే ఏం చేస్తాం, సరే అందని సమాచారం. దాన్ని బట్టి చూస్తే ఆమె ఇక అన్నిటికీ రెడీ అయిపోయిందని అర్థమవుతోంది.

ప్రస్తుతం రవితేజతో వీరభద్రమ్ చౌదరి సినిమా చేసేందుకు సిద్ధపడుతోంది తమన్నా. మరి తెలుగులో కూడా ఆమె ఫ్రీ ఆఫర్ ని దర్శకుడు ఉపయోగించుకుంటే కనుక తమన్నా అందాల విందును ఆరగించే అవకాశం తెలుగు ప్రేక్షకులకు కూడా దొరకుతుంది. లేదంటే ఆ అదృష్టం బాలీవుడ్ వారికి మాత్రమే దక్కుతుంది. అదీ సంగతి!

మరింత సమాచారం తెలుసుకోండి: