అత్తారింటికిదారేది లీక్డ్ వీడియో వ్యవ‌హారంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గర కీల‌క సాక్ష్యాలు ఉన్నాయ‌నేది ప‌వ‌న్ వాద‌న‌. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్లడించ‌కుండా, కేవ‌లం త‌న‌లోని ఆవేద‌న‌ను మాత్రమే థ్యాంక్యూ మీట్‌లో మీడియా ముందు పెట్టాడు. అయితే ఈ కుట్రకు సంబంధించిన వ్యక్తుల‌కి ఇండ‌స్ట్రీలో వారికి అపార బ‌లం ఉందని, వాళ్ళు సొసైటీలో ఎంతో హుందాత‌న్నాన్ని అనుభ‌విస్తున్నార‌ని ప‌వ‌న్ మాటల్లో తెలుస్తుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అన్ని విష‌యాలు తెలిసిన‌ప్పటికి, దానికి సంబంధించిన సాక్ష్యాలు మాత్రం లేవు. లీక్డ్ మూవీను చేయించిన వారు, చాలా తెలివిగా వ్యవ‌రించారని ఇండ‌స్ట్రీ టాక్‌. ఈ విష‌యంలో ఎటువంటి ఆధారం లేకుండా ఆ పెద్ద మ‌నుషులు జాగ్రత్తప‌డ‌టంతో, ఆ కుట్రకు స‌బంధించిన వ‌ర‌కూ వాళ్ళకు ఎటువంటి బుర‌ద అంట‌కుండా చూసుకున్నారు.

వాళ్ళు ఎవ‌ర‌న్నది ప‌వ‌న్‌తో పాటు మ‌రికొంత మందికి తెలిసినా, అది కేవ‌లం స‌మాచారం మాత్రమే, సాక్ష్యాల‌తో కూడిన ఆధారం ఎక్కడా లేద‌ని విశ్వశ‌నీయ స‌మాచారాం. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్  వాళ్ళమీద ఏదేనా యాక్షన్ తీసుకోవాలంటే అది వ్యక్తిగ‌తం మాత్రమే కాని, లీగ‌ల్‌గా ఏమి చేయ‌లేని ప‌రిస్థితి అని అంటున్నారు. దీనికి సంబంధించిన ఎక్స్‌క్టూజివ్ డిటైల్స్‌ను ఓ మీడియా స్పెష‌ల్ ప్రొగ్రామ్ పేరుతో టెలికాస్ట్ చేసింది. ఏద‌మైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి వ్యక్తి సాక్ష్యాలు లేకుండానే ఈ విధంగా మాట్లాడ‌తాడా అనేది మ‌రికొంద‌రి వాద‌న‌.

మరింత సమాచారం తెలుసుకోండి: