మెగా హీరోలు స‌క్సెస్‌ల‌తో దూసుకుపోతున్నారు. రీసెంట్‌గా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్తారింటికి దారేది క‌లెక్షన్స్‌తో దుమ్మురేపుతుంటే, మ‌రో మెగా హీరో అల్లుఅర్జున్ ఇంకో సక్సెస్ పాయింట్‌ను రీచ్ అయ్యాడు. మెగా హీరోల‌లో అల్లుఅర్జున్‌ది డిప్రెంట్ స్టైల్‌. అందుకే స్టైలిష్ స్టార్ అనే పేరు అత‌డి సొంతం అయింది. 

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి మెగా అభిమానులే కాకుండా, సోషియ‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్‌లోనూ ఫాలోవ‌ర్స్ ఎక్కువే. ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఈ మెగాహీరోకి ఉన్న ఫాలోవ‌ర్స్‌లో న‌ల‌భై శాతం మంది అమ్మాయిలే ఉంటారు. లేటెస్ట్‌గా అల్లుఅర్జున్ ఫేస్‌బుక్ ఫ్యాన్ మేడ్ పేజ్‌లో ప‌ది ల‌క్షల లైక్స్‌ను రీచ్ అయ్యాడు. టాలీవుడ్ హీరోల‌లో ఒక ఫ్యాన్ మేడ్ పేజ్‌కి ప‌ది ల‌క్షల మంది లైక్‌లు వ‌చ్చిన మొద‌టి హీరో ఈ అల్లుఅర్జునే. ఈ ఫీట్‌ను మెగా హీరో సాధించ‌డంతో అభిమానులు ఆనందంతో పండ‌గ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: