లిప్ లాక్ పై పవన్ మరదలు పంథా మార్చుకుంది, పవన్ కళ్యాణ్ కు మరదలు ఎక్కడిది అంటే ‘అత్తారింటికి దారేది’ లో అందంగా కనిపించి ఆయన మరదలుగా అదరగొట్టిన ప్రణీత. ఆమె ఈ సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ లో ప్రవేశించేందుకు తన గ్లామర్, లిప్ లాక్ వంటి విషయాలను కూడా అంత పెద్దగా పట్టించుకోను అనుకుందట.

ఏకంగా ఎంట్రీని పవర్ స్టార్ పవన్ తో ఇచ్చేసరికి ప్రణీత దశ తిరిగిపోయింది. అప్పుడే ఎన్నో ఏళ్లుగా స్టార్ డమ్ ను కొనసాగిస్తున్న టాప్ హీరోయిన్ల లెవల్లో ఫోజులు కొట్టడం మొదలు పెట్టింది అంటున్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల ఆలస్యం అవుతున్న సమయంలోను సినిమా దొరికితే చాలు అన్న ఆమే హఠాత్తుగా మాట మార్చారు.

పవన్ తో సినిమా సూపర్ హిట్టయినందుకు ఆమెకు సినిమాల ఆఫర్లు అంతా ఇంతా కాదట. అయితే అంతకు ముందు గ్లామర్, లిప్ లాక్ లనే నమ్ముకున్న సదరు సుందరి ఇప్పుడు వాటిపై ఆదారపడే సినిమాలకు ఒప్పుకోను, స్క్రిప్ట్ నచ్చితేనే ఒప్పుకుంటాను, కథ ప్రాదాన్యతకే నేను మొగ్గు చూపుతాను అందట. ఇదండీ ఓ సారి పవన్ సరసన అవకాశం వస్తే దశ ఎలా తిరుగుతుందో చెప్పడానికి అంటున్నారు టాలీవుడ్ లో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: