ఓ సినిమా చేయాలంటే ఏ హీరో అయినా ముందు చేసే పని ఏంటి! కథ వింటాడు. ఆ కథ నచ్చితే ఓకే అంటాడు. ఆ తర్వాతే మిగిలిన విషయాలు పట్టించుకుంటాడు. కానీ విష్ణు అలా చేయలేదు. అసలు కథే వినలేదు. కానీ సినిమా కమిటైపోయాడు. ఆ విషయాన్ని అతడే స్వయంగా చెబుతున్నాడు.
దూసుకెళ్తా సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. అసలు ఈ సినిమా కథను విష్ణు విననేలేదట. అతడు విదేశాల్లో ఉంటే, మనోజ్ ఫోన్ చేసి మంచి కథ ఉంది, నాన్న నేను విన్నాం, చాలా బాగుంది అని చెప్పాడట. వాళ్ల మీద నమ్మకంతో కథ వినకుండానే మనోడు ఓకే అన్నాడట. సినిమా షూటింగ్ మొదలయ్యాక చేసుకుంటూ పోతుంటే... అప్పుడు ఇంటరెస్టింగ్ గా అనిపించి ఇన్ వాల్వ్ అయ్యాడట. చివరకు చూసుకుంటే సినిమా అద్భుతంగా వచ్చింది అంటున్నాడు.

వామ్మో... ఇప్పటివరకూ ఏ హీరో కూడా ఇలా చేసి ఉండడేమో కదా! సంవత్సరాల పాటు కథ మీద చర్చలు జరిపి మరీ ఓకే అనే హీరోలున్నారు. కానీ అసలు కథే వినకుండా బరిలో దిగాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది తండ్రి, తమ్ముళ్ల మీద నమ్మకం అనాలా లేక తెగింపు అనాలా!

మరింత సమాచారం తెలుసుకోండి: