బాబోయ్ పవన్ కళ్యాణ్... గత మూడు రెండు రోజులుగా రాష్ట్రం అంతటా వినిపిస్తున్న మాట. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోను ఏ నోట విన్నా ఇదే మాట. దీంతో పవర్ స్టార్ పవర్ అదిరింది అంటున్నారు సాధారణ జనం కూడా. సినిమా హిట్టయితే కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడితేనే ఇంత హల్ చల్ సృష్టిస్తే ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చి జనంలో తిరిగితే ఏమైనా ఉందా.. అయ్య బాబోయ్ అందరి బాక్స్ లు బద్దలవుతాయేమో అంటున్నారు.

పైరసీ గూర్చి, తన జీవితం గూర్చి నాలుగు మాటలు చెప్పి, పైరసీ వారి భరతం పడతాను అన్నందుకు రెండు రోజులుగా ఎన్ని యాంగిల్స్ లో మీడియాలో వార్తల వరద పారుతోందంటే ఇప్పటి వరకు ఏ లెజండ్ పొల్టీషియన్ వాఖ్యలపై కూడా మీడియా ఇంత హంగామా చేసి ఉండదు అనేంతగా ఉంది. అంతెందుకు రాష్ట్రం విడగొడుతున్నాం అంటూ సిడబ్ల్యూసి మీటింగ్ తర్వాత వెలుబడ్డ ప్రకటన కూడా ఇంత హల్ చల్ చేయలేదేమో అంటే కూడా అతిశయోక్తి కాదనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు.

ప్రింట్ మీడియా కాస్తా టచ్ చేసి విడిచిపెట్టినా కూడా ఎలక్ట్రానిక్ మీడియా పవన్ మాటలతో పండగ చేసుకుంది. ఇక ఆన్ లైన్ మీడియానయితే ఆ సంబారాల్లో ఇంకా మునిగి తేలుతోంది. పైరసీ ఎవరు చేసారో తెలుసు అంటే వారెవరో అంటూ ఏకంగా అల్లు అరవింద్, రాంచరణ్ వంటి పేర్లను అనుమానాలకింద చూపిస్తూ ఆగమాగం అయింది మీడియా. ఇక రాజకీయాల గూర్చి ఆయన ప్రసంగంలో ప్రస్తావనే లేకపోయినా కూడా ఆయన మాటలు చూస్తే రాజకీయాల్లోకి పవన్ కళ్యాన్ వస్తున్నాడు అంటూ తెగ వార్తలు దంచేసాయి. ఇదంతా ఎందుకు అంటే ఇంత పాపులారిటి పవన్ కు ఉంది అని చెప్పడానికి ఇది ఉదహరణ. అంతే కాదు పవన్ కు ఇప్పుడు వచ్చిన పాపులారిటి చూసి కొందరి గుండెలు మాత్రం అదిరిపోయాయి అంటున్నారు పరిశీలకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: