బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ మళ్ళీ వర్తలకేక్కింది ‘ది బ్యాచిలరెట్ ఇండియా-మేరే ఖాయాలోన్ కి మల్లికా' అనే రియాల్టీ షోను మల్లిక మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ షోకు పబ్లిసిటీ కల్పించు కోవడం కోసం మల్లిక ప్రతిరోజు ఒకొక్క హాట్ స్టేట్ మెంట్ వొదులుతోంది. ఇప్పటికే బీజేపీ ప్రధాని అభ్యర్థిని నరేంద్రమోడీని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనడమే కాకుండా ఆయన చాలా హాట్‌గా ఉంటారు అంటూ, రాహుల్ గాంధీ పై తనకు పెద్ద ఇంట్రస్టు లేదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికా షెరావత్ లేటెస్ట్ గా తన టార్గెట్ సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ వైపు మళ్ళించింది. రజనీకాంత్‌తో ఎవరూ లేని ద్వీపంలో ఒంటరిగా గడపాలని ఉందిఅంటూ మరో లేటెస్ట్ బాంబ్ పేల్చింది.

అంతేకాదు రజనీకాంత్ తన పక్కన ఉంటే తను బోర్ ఫీల్ కాను అని అంటోంది ఈ హాట్ బ్యూటీ ‘ది బ్యాచిలరెట్ ఇండియా-మేరే ఖాయాలోన్ కి మల్లికా' రియాల్టీషో లైఫ్ ఓకే ఛానల్లో అక్టోబర్ 7న ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ షోలో 18 మంది పోటీదారులు ఈషోలో మల్లికను దక్కించు కోవడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటే మల్లిక మాత్రం రజినీకాంత్ గురించి ఆలోచిస్తోంది. ఇప్పటికే కోలీవుడ్ మీడియాలో రజినీకాంత్ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వస్తున్న నేపధ్యంలో మల్లికా వింత కోరికను రజినీ కోలుకుని తీర్చేది ఎప్పుడో?

మరింత సమాచారం తెలుసుకోండి: