పాపం ఎన్టీఆర్ కోరిక ఇంకెన్నాళ్లకు నెరవేరుతుందో అంటూ ఆయన అభిమానులు, సన్నిహితులు తెగ బాధ పడుతున్నారట. అది ఇక నెరవేరినట్టే అని ఆశపడ్డ తరుణంలో ఆది కాస్త దూరం కావడంతో ఎన్టీఆర్ లో కూడా తన కోరిక నెరవేర్చుకోవడంపై బెంగ పెట్టుకున్నాడు అంటున్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్ పవన్, మహేష్, రాంచరణ్ వంటి వారికి ఏమాత్రం తీసిపోని హీరో జూనియర్. పైగా నందమూరి వంశ ప్రతిష్ట, ప్రత్యేక అభిమాన గణం జూనియర్ సినిమాల్లోకి రాకముందే ఉంది. అలాంటిది తన కంటే ముందుగా మెగా హీరోలు పవన్, రాంచరణ్ లు సాదించిన రికార్డును చేరుకోవడం కోసం అహర్నిషలు కష్టపడ్డాడు.

అదేనండి 50 కోట్లు కలెక్షన్లు సాధించిన సినిమాక్లబ్ లో చేరడం కోసం. ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదలయిన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్లు కలెక్షన్లు సాధిస్తుందని, ఈ సారి 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ఎన్టీఆర్, ఆయన అభిమానులు తెగ ఆశపడ్డారు. కాని రామయ్యా వస్తావయ్యా కు పండగపూట కూడా థియేటర్ల వద్ద తగ్గిన జనం, వస్తున్న కలెక్షన్లు ఆ కోరికను తీర్చేలా లేదని స్పష్టం అయిందంటున్నారు. అందుకే పాపం... ఎన్టీఆర్ కోరిక ఇంకెన్నాళ్లకు తీరుతుందో అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: