ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన స్పీచ్‌కి ఇండ‌స్ట్రీ రెండుగా చీలిపోయింది. ఇప్పటి వ‌ర‌కూ టాలీవుడ్‌లోని పెద్ద త‌ల‌కాయ‌ల‌కు త‌ల‌వొంచుతున్న చిన్న త‌ర‌హా వ్యక్తులు, ఇక నుండి ఆ అవ‌స‌రం లేదంటున్నారు. మాకు ప‌వ‌న్ అండ‌గా ఉన్నాడంటూ వారందరూ ప‌వ‌న్ వైపు అడుగులు వేస్తున్నారు.

వివాదాల‌కు దూరంగా ఉంటే ప‌వ‌ర్‌స్టార్‌, మొద‌టిసారిగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్రమ గురించి ఘూటుగా స్పందించ‌డ‌మే కాకుండా, తాట‌తీస్తా అని తీవ్రస్థాయిలో హెచ్చరిక‌లు జారిచేయ‌డంతో ఇది ఎంత‌టి వ‌ర‌కూ దారితీస్తుందో అని ఎవ్వరికి అర్ధం కావ‌డంలేదు. ముఖ్యంగా చిన్న సినిమాల‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌టంలేద‌ని ప్రొడ్యూజ‌ర్లు ఎప్పటినుండో టాలీవుడ్ పెద్దల‌పై పోరాడుతున్నారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే, 'మా చిన్న సినిమాల‌కు థియోట‌ర్లు లేకుండా చేస్తున్నారు. లాభీయింగ్ చేసి త‌క్కువ రేటుకే తీసుకుంటున్నారు అందుకే మేము న‌ష్టపోవాల్సి వ‌స్తుంద‌ని' త‌మ వాద‌న‌ను వినిపిస్తున్నారు.

మొన్నటి అ.దా మూవీ థ్యాంక్యు మీట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆవేద‌న‌ కూడ అదే. '365 రోజులు మా మూవీలే ఉండాల‌నుకోవ‌డంలేదు. మాది ఒక్క రోజు పండ‌గ మాత్రమే' అని కుండ‌బ‌ద్దలు కొట్టిన‌ట్టు చెప్పాడు. ఈ స్టేట్‌మెంట్‌కి కార‌ణం మూవీల‌ను రిలీజ్ చేయ‌టానికి వీలులేకుండా చేస్తున్న ఆ పెద్ద వ్యక్తుల‌ను టార్గెట్ చేయ‌డ‌మే అని అంద‌రికి అర్ధం అయింది. ఇప్పుడు చిన్న చిన్న సినిమాల వాళ్ళు, వారి బాధ‌ల‌ను ప‌వ‌న్‌కు విన్నవించుకోవ‌డానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికే ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ కోసం సంప్రదింపులు జ‌రుపుతున్నారు. ప‌వ‌న్ మాత్రం అప్పుడే తొంద‌ర‌పాటు నిర్ణయాలు తీసుకోవ‌డంలేదు. త‌న మూవీకి జ‌రిగిన కుట్రను ఎదుర్కొంటాన‌ని చెప్పాడు కాని, అంద‌రి బాధలు తీరుస్తాన‌ని చెప్పలేదు. అందుకే చిన్న సినిమాల వాళ్ళ బాధ‌లు వినాలా,లేదా అనేదానిక‌పై త్వర‌లోనే డెసిష‌న్ ఉంటుంద‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: