టాలీవుడ్ సినిమా రంగంలో ఏదైనా వెరైటీగా చేయాలి అంటే తానే అంటాడు నాగ్. మాస్ హీరోగా పత్రాలు చేస్తూ వాటి మధ్య భక్తి సినిమాలు చేసి అభిమానులను మెప్పించిన రికార్డు నాగ్ సొంతం. ఈ రోజు ఒక ప్రముఖ పత్రికలో నాగార్జున ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తున్న ‘అత్తారింటి దారేది’ పై సరికొత్త వ్యాఖ్యానాలు చేసాడు నాగ్. సినిమా రంగంలో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతు ఉంటుందని చెపుతూ ఒక దశలో యాక్షన్ సినిమాలు వస్తే తరువాత దశలో ఫ్యాక్షన్ సినిమాలు రాజ్యం ఎలాయి అని అంటూ, అత్తారింటికి దారేది పుణ్యమా అని ఇక కుటుంబ కధా చిత్రాలు తెలుగులో వస్తాయని తనకు నమ్మకం ఏర్పడిందని అంటు, ఈ సరి కొత్త ట్రెండ్ కు దారి చూపిన ట్రెండ్ సెట్టర్ గా పవన్ అత్తారిల్లు నిలిచిపోతుందని అన్నారు.

తనకు ఎప్పటి నుంచో ఒక పౌరాణిక సినిమా చేయాలనీ ఉందనీ, ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకుని ఎవరైనా ‘మాయాబజారు’ లాంటి సినిమా తీస్తే తనకు అందులో నటించాలని ఉందని చెపుతూ, సరైన దర్శకుడు, సరైన నటీనటులతో ‘మాయాబజారు’ ను తీస్తే ‘అవతార్’ సినిమాల ప్రపంచ వ్యాప్తంగా ఇది రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నాడు నాగ్. పవన్ నిర్మాతగా కొత్త అవతారం ఎత్తుతున్నాడు కాబట్టి నాగార్జున చెపుతున్న మాటలు గురించి ఆలోచించి ఈ పౌరాణిక సినిమాలకు కూడా దారి చూపెడతాడెమో మన పవర్ స్టార్...

మరింత సమాచారం తెలుసుకోండి: