హమ్మయ్యా... ఎట్టకేలకు అబ్బాయ్ రాంచరణ్ ను బాబాయ్ పవన్ కళ్యాణ్ బీట్ చేస్తున్నాడు అంటున్నారు టాలీవుడ్ లో. ఇన్నాళ్లు రాంచరణ్ రికార్డును బద్దలు చేయడం ఏహీరో వల్ల కాదు అనుకున్నారు. కాని అది ఎట్టకేలకు బద్దలవుతోంది, అది కూడా బాబాయ్ తోనే.

తెలుగు సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా గా రాంచరణ్ ‘మగధీర’ రికార్డు సృష్టించి ఇన్నాళ్లు తనవద్దనే ఉంచుకుంది. ఈ సినిమా ఏకంగా 72 నుంచి 73 కోట్లు కలెక్షన్లు సాధించింది. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ సినిమా అధిగమించలేదు. అయితే పవన్ సినిమా ‘ అత్తారింటికి దారేది’  ఈ రికార్డును బద్దలు చేయడం దాదాపు ఖాయమైందట.

అత్తారింటికి దారేది ఇప్పటికే 67 కోట్లు కలెక్షన్లు సాదించింది, ఇంకా వారం పదిరోజుల్లో ఇది 73 కోట్లు కలెక్షన్లు దాటేసి తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదు చేసుకోబోతోంది అంటున్నారు. ఇందులో రాంచరణ్ కూడా హ్యాపీగా ఫీలయ్యే విషయమేంటంటే తన రికార్డు బద్దలవుతున్నా కూడా ఆ రికార్డు మెగా హీరోల ఖాతాలో ఉంటుండడమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: