అత్తారిల్లు భారీ సక్సస్, ఆ తరువాత జరిగిన ‘థాంక్స్ గివింగ్ మీట్’ సంచలనాలతో మంచి జోష్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ తన గబ్బర్ సింగ్ సీక్వెల్ ను ఎట్టి పరిస్థితులలోను వచ్చే నెల నుండి ప్రారంబిద్ధామన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నాడు పవన్. పేరుకు ఈ సినిమా దర్శకుడు సంపత్ నంది అయినా అన్ని వ్యవహారాలు పవన్ ఈ సినిమాకు సంబంధించి దగ్గర ఉండి చూసుకుంటున్నాడట. అంతేకాదు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా అన్ని నిర్ణయాలు పవర్ స్టార్ యే తీసుకుంటున్నాడట. ఈ వార్తల నేపధ్యంలో ‘గబ్బర్ సింగ్-2’ లో పవన్ తో రొమాన్స్ చెయ్యబోయే హీరోయిన్ ఎంపిక పై రోజురోజుకూ టాలీవుడ్ లో ఆశక్తి పెరిగిపోతోంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం కొద్ది రోజుల క్రితం గబ్బర్ సింగ్ సీక్వెల్ కు బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎంపిక అయింది అని వార్తలు వినిపించినా, ఏకంగా ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ 3 కోట్ల భారీ పారితోషికాన్ని మన పవర్ స్టార్ తో నటించడానికి అడగడంతో ఖంగు తిన్న పవన్, అనుష్క శర్మ కు మూడు కోట్లు ఇచ్చే బదులు, మరికొంచెం పారితోషికం ఎక్కువగా ఇస్తే బాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ దీపిక పడుకొనే వస్తుంది కదా..! అన్న ఉద్దేశంతో అనుష్క శర్మ ప్రపోజల్ కు అడ్డుకట్ట వేసి దీపిక గురించి తీవ్రంగా పవన్ ఆలోచిస్తున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఇలా రావడానికి మరో ప్రధాన కారణం ఉంది అని అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. ఇప్పటికే టాలీవుడ్ రంగంలో తన స్టామినా ను చాటుకున్న పవన్ కు కూడా బాలీవుడ్ పై ఎక్కడో బయటపడని మమకారం ఉందట. ఈ మమకారం తో దీపికను గబ్బర్ సింగ్ సీక్వెల్ లో హీరోయిన్ గా నటింప చేస్తే, ప్రస్తుతం బాలీవుడ్ లో వెలిగిపోతున్న ఆమె ఇమేజ్ వల్ల కూడా బాలీవుడ్ మార్కెట్ లో పవన్ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడుతుందని పవన్ సన్నిహితులు సుచిస్తున్నారట.
ఈ విషయాలు అన్నీ వింటూ తన ‘గబ్బర్ సింగ్-2’ హీరోయిన్ ఎవరు..? అనే విషయంపై పవన్ తీవ్రంగా తన సన్నిహితులతో చర్చలు చేస్తున్నాడని టాక్. పవన్ రాజకీయాలలోకి వస్తాడా..? అంటూ మీడియా కధనాలు ప్రసారం చేస్తుంటే, మన పవర్ స్టార్ మాత్రం తన గబ్బర్ సింగ్ సీక్వెల్ కధానాయిక గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే అబ్బాయి చరణ్ ప్రియాంకా చోప్రా తో రొమాన్స్ చేశాడు కాబట్టి ప్రస్తుతం బాబాయి కూడా బాలీవుడ్ బ్యూటీ గురించి ఆలోచిస్తున్నాడేమో అని అనిపిస్తోంది. మరి కొద్ది రోజులలో ఈ వార్తలకు క్లారిటీ వస్తుంది అని అంటున్నారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: