మన టాప్ హీరోలు తాము సినిమాలలో నటించినందుకు కోట్లాది రూపాయలు భారీ పారితోషికాలుగా తీసుకుంటారు కాని ఎవరూ వారు నటించిన పరాజయం చెందినప్పుడు ఆ పారితోషికాన్ని తిరిగి ఇచ్చి వేసిన సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. కాని అసలు సినిమా యే మొదలు కాకుండా ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తి కాకుండా కేవలం ఆ దర్శకుడికి ఇచ్చిన మాట కోసం అక్షరాలా 10 కోట్ల రూపాయలు వదులుకున్న టాప్ హీరో కు సంబంధించిన వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్ గా మారింది. ఆ హీరో మరెవ్వరో కాదు సింగం స్టైల్ అంటూ దుమ్మురేపే హీరో సూర్య.

ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే ‘ధ్రువ నక్షత్రియమ్ ’ సినిమాలో సూర్య నటించాల్సి ఉంది. కాని ‘సింగం’ సినిమా రిలీజ్ అయి నెలలు గడచిపోతున్నా గౌతమ్ మీనన్ ఈ సినిమా స్క్రిప్ట్ ను చెక్కేపని పూర్తి చేయకపోవడంతో రోజులు గడచిపోతున్నాయనే అసహనంతో సూర్య ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. అయితే గౌతమ్ మీనన్ లాంటి గొప్ప దర్శకుడి విలువైన కాలం కూడా ఈ ‘ధ్రువ నక్షత్రియమ్ ’ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తూ వృధాగా గడచిపోయింది కాబట్టి దానికి పరిహారంగా 10 కోట్ల రూపాయలు గౌతమ్ మీనన్ కు ఎదురు ఇచ్చి ఈ సినిమా ప్రాజెక్ట్ ను కాన్సిల్ చేసుకొని ప్రముఖ దర్శకుడు లింగుస్వామి సినిమాకు ఒకే చేశాడట.
ఈ వార్త కోలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలన వార్తగా మారడమే కాకుండా హీరోలు అందరూ సూర్య లా ప్రవర్తించి సాంకేతిక నిపుణులకు గౌరవం ఇవ్వాలి అంటూ కోలీవుడ్ మీడియా లో సూర్య ను పొగుడుతూ వార్తలు వస్తున్నాయి. ఎటువంటి కారణాలు చెప్పకుండానే తాము చేద్దాం అనుకున్న దర్శకుల సినిమాలను రాత్రికి రాత్రే ఆపేసే మన క్రేజీ టాలీవుడ్ యంగ్ హీరోలు సూర్య ను ఆదర్శంగా తీసుకుంటారా...? అనేదే ప్రశ్న.
 

మరింత సమాచారం తెలుసుకోండి: