హిట్టు, ప్లాపుల‌తో సంబంధంలేకుండా వ‌రుస మూవీలు చేసుకుంటూ వెళుతున్న వ‌రుణ్‌సందేష్‌, ఓ కొత్త విష‌యాన్ని క‌నుక్కున్నాడు. త‌న‌కు తెలియ‌కుండానే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌ను వాడుకున్నాడంటూ మాట‌లు చెబుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ అంద‌రూ ప‌వ‌నిజానికి జై కొడుతున్నారు. ఇందులో పెద్ద హీరోల నుండి, చిన్న హీరోల వ‌ర‌కూ ఉన్నారు. 

లేటెస్ట్‌గా వ‌స్తున్న యంగ్ హీరోలు, త‌మ మూవీల‌లో ప‌వ‌న్ మూవీకు సంబంధించిన పాట‌ల‌ను, సీన్లను పెట్టుకొని సంతోష ప‌డుతుంటే, వ‌రుణ్‌సందేష్‌కి మాత్రం రివ‌ర్స్‌లో జ‌రుగుతుంది. ప‌వ‌న్ మూవీలో వ‌రుణ్‌సందేష్ పోస్ట్‌ర్‌ను చూపించారు. ఈ విషయం ఇప్పటివ‌ర‌కూ ఎవ‌రికి తెలియ‌క‌పోయినా, వ‌రుణ్‌సందేష్ మాత్రం ఇట్టే క‌నిపెట్టేశాడు.

పూరిజ‌గ‌న్నాద్ తెర‌కెక్కించిన కెమెరామెన్ గంగ‌తో రాంబాబు మూవీలోని ఓ ఫైట్ సీన్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెనుక ఎక్కడో దూరాన వ‌రుణ్‌సందేష్ న‌టించిన మూవీ పోస్టర్ క‌నిపిస్తుంది. అది ఏమైందిఈవేళ మూవీకు సంబంధించిన పోస్టర్‌. ఈ విష‌యాన్ని వ‌రుణ్ సందేష్ చెబుతూ 'ఆ ఫోటోను జాగ్రత్తగా చూడండి బ్రద‌ర్స్‌, అందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెనుక నా మూవీ పోస్టర్ ఉంది. అది ఏమైంది ఈ వేళ మూవీ పోస్టర్‌. అదీ లెక్క' అంటూ తెగ సంబ‌రిపడిపోతున్నాడు. ప‌వ‌న్ మూవీలో రోల్ రాక‌పోయినా క‌నీసం పోస్టర్‌గా క‌నిపించినందుకు థ్యాంక్స్ చెప్పకుండా, అదీ లెక్క అంటే దాని అర్ధం ఏంటో ఎవ్వరికి అర్ధం కావ‌డంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: