అదిరిపోయే పర్సనాలిటీ, కండలు తిరిగిన దేహం, అదరగొట్టే డ్యాన్సులు... అతడి పేరు చెబితేనే యువత ఊగిపోతారు. అర్థమైపోయిందిగా ఎవరి గురించో. అవును... అతడు హృతిక్ రోషనే. ఇతగాడికి ఈ మధ్య టాలీవుడ్ మీద మనసు తిరిగింది. అందుకే ఇక్కడ కూడా తన సత్తా చూపాలని అనుకుంటున్నాడు. 
కోయి మిల్ గయాలతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నహృతిక్... క్రిష్ చిత్రంతో బాలీవుడ్ హీమేన్ అయిపోయాడు. పిల్లల దృష్టిలో అయితే సూపర్ మ్యాన్ అయిపోయాడు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా... ప్రత్యేకమైన పవర్స్ ఉన్న వ్యక్తిగా క్రిష్ లో అతడి నటన సూపర్బ్. అందుకే ఇప్పుడు క్రిష్ 3ని తీసుకొస్తున్నారు. హృతిక్, ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ తదితర భారీ తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రంపై బాలీవుడ్ అంచనాలు భారీగా ఉన్నాయి. నవంబర్ 1న దేశవ్యాప్తంగా అయిదు వేల థియేటర్లలో రిలీజ్ కానున్న క్రిష్ 3 రికార్డులు బద్దలు కొట్టేస్తుందని ఆశిస్తున్నారు.

అయితే ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు హృతిక్. బాలీవుడ్ వాడే అయినా ఏపీలో కూడా హృతిక్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న అతడు, టాలీవుడ్ వారికి మరింత దగ్గరయ్యేందుకు స్కెచ్ వేశాడు. క్రిష్ 3ని తెలుగు వారి వద్దకు తెస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్, ధూమ్ 2, జోథా అక్బర్ చిత్రాలను కూడా తెలుగు, మలయాళ భాషల్లోకి అనువదించి విడుదల చేస్తాడట. అయితే ఇది అంత మంచి ఆలోచన కాకపోవచ్చు. కారణం... మనవాళ్లు హృతిక్ ని ఇష్టపడ్డారంటే అతడి సినిమాలు చూసే కదా! హిందీలో వాటిని చూసేశాక తెలుగులో మళ్లీ ఎందుకు చూస్తారు! క్రిష్ 3 ఓకే. ఇప్పుడే రిలీజవుతోంది కాబట్టి. కానీ అంతకు ముందు సినిమాలను రిలీజ్ చేయడం అనవసరం. పైగా ఎంత తెలుగులోకి అనువదించినా, హృతిక్ పోస్టర్ చూసి జనం థియేటర్ కు వెళ్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే మనవాళ్లు హిందీ హీరోలకు అంత త్వరగా కనెక్ట్ కారు కాబట్టి. కాబట్టి కండలవీరుడు ఈ విషయం గురించి మరోసారి ఆలోచిస్తే బెటర్!


మరింత సమాచారం తెలుసుకోండి: