ఈ పేటకు నేనే మేస్త్రి అంటూ అప్పట్లో చిరంజీవి వేసిన స్టెప్పులకు మెగా ఫ్యాన్స్ ఊగిపోయారు. ముఠామేస్త్రి చిత్రం కమర్షియల్ గా నిరాశనే మిగిల్చినా... ఆ టైటిల్ సాంగ్ మాత్రం ఇప్పటికీ పలువురి నోట వినిపిస్తూనే ఉంటుంది. అందుకేనేమో... ఇప్పుడు చిరంజీవి తనయుడిని కూడా మేస్త్రిని చేయాలని డిసైడయ్యాడు సంపత్ నంది.
ఏమైంది ఈవేళ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది మీద మెగా హీరోల కళ్లు పడ్డాయి. ఆల్రెడీ చెర్రీతో ఓ సినిమా చేసేశాడు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో పని చేయబోతున్నాడు. అది ఇంకా సెట్స్ మీదికే వెళ్లలేదు. అప్పుడే రామ్ చరణ్ కోసం ఓ కథ తయారు చేసేశానంటున్నాడు. పవన్ తో సినిమా ముగిశాక చెర్రీతో కలసి పని చేయడానికి ఆల్రెడీ ఓ కథను తయారు చేసుకున్నాడట సంపత్ నంది. ఆ కథకు ఛోటా మేస్త్రి అని పేరు కూడా పెట్టినట్లు సమాచారం. చెర్రీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసిన మాస్ మసాలా కథట ఇది. చిరంజీవి షేడ్ కూడా పడేలా చేసేందుకు మేస్త్రిని టైటిల్ లో పెట్టాడు. 

ప్లాన్ బానేవుంది కానీ ఎప్పటికి వర్కవుటవుద్ది అనేదే ప్రశ్న. చెర్రీ ఆల్రెడీ కృష్ణవంశీ, దశరథ్ చిత్రాలను కమిటై ఉన్నాడు. దశరథ్ అంటే ఓకే గానీ, కృష్ణవంశీ సినిమా అంటే అది ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పటికి ముగుస్తుందో, ఎప్పటికి రిలీజవుతుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు అతడి మార్కెట్ బాలేదు కాబట్టి. వెంకీ, చెర్రీలను చూసి సినిమాను ఎవరైనా కొన్నా... కేవీ హిట్ చేయగలడా అన్నదే సందేహం. దశరథ సినిమా కూడా ఇంకా సెట్స్ మీదికి పోలేదు. ఈ రెండూ ముగిస్తే కానీ చెర్రీ ఫ్రీ అవడు. అటు సంపత్ కూడా గబ్బర్ సింగ్ సీక్వెల్ పని అయితేనేగానీ మరో సినిమా జోలికి పోలేడు. ఇంతోటి దానికి అప్పుడే ఈ కబుర్లు ఎందుకట. అప్పుడు మాట్లాడుకుందాంలెండి!

మరింత సమాచారం తెలుసుకోండి: