‘గుండెజారి గల్లంతైందే’ తో క్రేజీ హీరోగా టాలీవుడ్ లో వరస హిట్స్ కొడుతున్న యంగ్ హీరో నితిన్ తన హ్యాట్రిక్ హిట్ కోసం పూరి జగన్నాధ్ తో కలిసి ప్రేక్షకులకు ‘హార్ట్ అటాక్’ తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నితిన్ సెంటిమెంట్ కోసం నిత్యా మీనన్ కూడా నటిస్తోంది. ఆదా శర్మ హీరోయిన్ గా నితిన్ తో నటిస్తున్న ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్ ఈమధ్యనే స్పెయిన్ లో ముగించుకుంది.

ఈ సినిమాకు సంబంధించి ఆఫీసియల్ గా ఫస్ట్ లుక్ విడుదల చెయ్యకపోయినా ఈ సినిమా లో నితిన్ లుక్ కు సంబంధించిన ఫోటోలు ఇంటర్ నెట్ లో లీక్ చేయబడి నితిన్ అభిమానుల మధ్య సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలో నితిన్ లుక్ ఒక రోమియో లా ఉంటుందని, అంతేకాకుండా నితిన్ ఒక పోకిరి ప్రేమికుడిగా ఈ సినిమాలో కనిపిస్తాడని వినిపిస్తున్న మాటలకు ఇప్పుడు వెబ్ మీడియా లో హడావుడి చేస్తున్న ఫోటోలు ఆ కధనాలకు బలం చేకూరుస్తున్నాయి.

పూరి జగన్నాధ్ ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో కలిగిన షాక్ నుండి తేరుకొని తన సొంత బ్యానర్ పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ నెలాఖరుకు టాలీవుడ్ లో సందడి చేస్తుందని టాక్. ఏది ఏమైనా హీరో నితిన్ ను ఈ వెరైటీ గెటప్ లో యూత్ ఎలా ఆదరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: