74 ఏళ్ళ సినీ జీవితాన్ని నిరంత‌రాయంగా ఇప్పటికీ కొన‌సాగిస్తున్న ఆంద్రా అభిమాన బుల్లోడు అక్కినేని నాగేశ్వరరావు, ఈ రోజు మీడియా మీటింగ్ పెట్టారు. సినీ ఇండ‌స్ట్రీమీద ఉన్న అభిమానాన్ని, ఇంత కాలం అభిమానులు చూపించిన ఆధ‌ర‌ణ గురించి ప్రసంగించారు. త‌న అనుభ‌వాల‌ను మీడియా ద్వార అభిమానుల‌తో పంచుకుంటూనే మ‌రో అందోళ‌న క‌ర‌మైన వార్తను కూడ బ‌హిర్గంతం చేశారు.

'అక్టోబ‌ర్‌ 8న నాకు క‌డుపు నొప్పి వ‌చ్చింది. డాక్టర్స్ అంతా పూర్తి ప‌రిక్షలు నిర్వహించి నాలో క్యాన్సర్ క‌ణాలు ఉన్నాయ‌ని గుర్తించారు. దీని వ‌ల్ల ఆందోళ‌న చెందాల్సి అవ‌స‌రం లేదు. ఈ వ‌య‌స్యులో వ‌చ్చిన క్యాన్సర్ కాబ‌ట్టి, ఆ క‌ణాల‌కు చ‌ల‌నం కూడ త‌క్కువుగానే ఉంటుంద‌ని డాక్టర్స్ అన్నారు. నేను విన్నవించేది ఏంటంటే, నాకు ఏదో అయింద‌ని ఎవ‌రూ భ‌యాందోళ‌న‌ల‌కు గురికావ‌ల్సిన అవ‌స‌రం లేదు. మీ ఆశ్వీర్వబ‌ల‌మే మ‌రింత ఆయుష్సును చేకూరుస్తుంది' అంటూ వివ‌రించారు.

ఎట్ ప్రెజెంట్ అక్కినేని నాగేశ్వర‌రావు ప్యామిలి మొత్తం క‌లిసి మ‌నం మూవీలో న‌టిస్తున్నారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఒకే ప్యామిలికి చెందిన‌ మూడు త‌రాల న‌టులు క‌లిసి న‌టించ‌డం అనేది ఇదే మొద‌టిసారి.

మరింత సమాచారం తెలుసుకోండి: