చూడూ ఒక వైపే చూడూ రొండో వైపు చూడాలనుకోకూ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ కు థియేటర్లో ప్రేక్షకులు మస్త్ ఎంజాయ్ చేశారు. అలాగే ఇప్పడు బోయపాటితో రాబోయే చిత్రంలో బాలయ్యతో ఇంకెన్ని పంచ్ డైలాగులు చెప్పిస్తారో అని నందమూరి ఫ్యాన్ ఉత్కంటంగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న చిత్రం బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి అలరించనున్నారని తెలుస్తోంది.

అవీ తండ్రీ కొడుకులు పాత్రలు అని చెప్తున్నారు. ఇక తండ్రి పాత్రకు జోడీగా నదియా నటిస్తుందనే ప్రచారం అంతటా జరుగుతోంది. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన సింహా చిత్రంలోనూ బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసారు. డాక్టర్ గా,లెక్చరర్ గా రెండు పాత్రల్లో అదరకొట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది.  సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది.

ఈ చిత్రంలో జగపతిబాబు విలన్ గా చేస్తున్నారు. పిబ్రవరికి చిత్రం రిలీజ్ చేయాలనే ఆలోచనతో వున్నారు ఎలక్షన్స్ మార్చి ల లేదా ఏప్రియల్ లలో వచ్చేటట్లు ఉండటంతో ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయనుండటంతో ఈ చిత్రం కొంత వరకూ హెల్ప్ అవుతుందని ఆ దిశగా ప్లాన్ చేస్తున్నట్లు  సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: