అక్కినేని నాగేశ్వర‌రావు చాలా కాలం తరువాత మీడియా ముందుకు వ‌చ్చాడు. ఇది పూర్తిగా త‌న వ్యక్తిగత మీటింగ్ అని చెప్పాడు. నాగేశ్వర్వరరావు ప్రస్తుతం మ‌నం మూవీ షూటింగ్‌లో బిజిబిజిగా గుడుపుతూ కొడుకు,మ‌న‌వుడితో క‌లిసి న‌ట‌న‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కినేని మూడు త‌ర‌వాల న‌టులు క‌లిసి ఒకే తెర‌పై క‌నిపించ‌డం అనేది టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే చాలా అరుదుగా జ‌రుగుతుంది.

ఇదిలా ఉంటే నాగేశ్వర‌రావుకి క్యాన్సర్ క‌ణాలు ఉన్నట్టు గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ నిపుణులు గుర్తించారు. ఈ విష‌యం టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కూ తెలిసింది. దీంతో నాగేశ్వర‌రావు ఆరోగ్యంపై ర‌క‌ర‌కాలు వార్తలు చ‌క్కెర్లు కొడుతున్నాయి. వీట‌న్నింటికి స‌మాధానంగా అంద‌రికి ఈ విష‌యాన్ని స్పష్టంగా తెలియ‌జేయాల్సి అవ‌స‌రం త‌న‌కు ఉంద‌ని నాగేశ్వర‌రావు మీడియా మీటింగ్ పెట్టి, అభిమానుల‌కు త‌న ఆరోగ్య స‌మాచారాన్ని తెలియ‌ప‌రిచాడు. 

'క్యాన్సర్ క‌ణాలు ఉన్నాయి అనేది నిజ‌మే కాని, మ‌నో నిబ్బరంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నంత కాలం నాకు ఏమి కాదు అని డాక్టర్లు చెప్పారు. మీరు కూడ ఏ మాత్రం చింతించ‌కుండా ఉండండి.మీరు నా కోసం చేయాల్సింది ఒక్కటే. న‌న్ను ఎవ‌రూ క‌ల‌వాటానికి కాని, మాట్లాడ‌టానికి కాని, ఎక్కడిఎక్కడి నుండో ఇక్కడ‌కు రావ‌ద్దు. నా గురించిన స‌మాచారాన్ని తెలియ‌ప‌ర‌చటానికి ప్రతి నిముషం మీడియా ద్వార అందుబాటులో ఉంటాను. మీరు సంతోషంగా ఉండి, నేనే ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకోండి, ఖ‌చ్ఛితంగా నేను 94 ఏళ్ళ వ‌ర‌కూ ఉంటాను.' అని మ‌రికొద్ది నిముషాలు మాట్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: