రామ‌య్యా వ‌స్తావ‌య్యా మూవీ రిలీజ్ అయి వారం రోజుల కాక‌ముందే డైరెక్టర్ హ‌రీష్‌శంక‌ర్ సంబంధంలేని మాట‌లు మాట్లాడి టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. రామ‌య్య వ‌స్తావ‌య్యా మూవీ రిజ‌ల్ట్‌పై మీడియాను ఆహ్వానించిన హ‌రీష్ శంక‌ర్ ఏవిధంగా మాట్లాడ‌కుడ‌దో, అదే విధంగా మాట్లాడి క‌నీస విలువ‌ల‌ను పాటించ‌లేక‌పోయాడు.

మూవీను డైరెక్ట్ చేయ‌డంతో ఆ డైరెక్టర్ ప‌ని అయిపోదు. దాన్ని ప్రమోట్ చేసుకోగ‌ల‌గాలి, త‌ప్పు జ‌రిగినా స‌మయం వ‌చ్చే వ‌ర‌కూ వేచి ఉండాలి. ఇవేమి హ‌రీష్ శంక‌ర్‌లో క‌నిపించ‌లేదు. బ్లాక్‌బ‌స్టర్ మూవీను టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు అందించిన అనుభ‌వం ఉన్న డైరెక్టర్‌గా హ‌రీష్ మాటల్లో క‌నిపించ‌లేదు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే యంగ్ టైగ‌ర్ మూవీపై ప్రెస్ మీట్ పెట్టిన హ‌రీష్‌ ఈ విధంగా మాట్లాడాడు.

'రామ‌య్య వ‌స్తావ‌య్యా మూవీను అక్టోబ‌ర్‌9న ఎన్టీఆర్ ఫ్యామిలి చూసింది. సెకండ్ ఆఫ్‌లో ఇంత‌గా యాక్షన్ ఉందేంటి అన్నారు. మొత్తంగా చెప్పాలంటే మూవీ రిజ‌ల్ట్ ఆశించినంత ఆశాజ‌న‌కంగా లేదు. ఇది అందరూ ఒప్పుకోద‌గ్గ విష‌యం. మూవీ ఎందుకు చూడాల‌ని అని ఎవ‌రైనా అనుకున్నవాళ్ళకు నేను ఒక్కటే చెబుతున్నాను. ఇప్పటి వ‌ర‌కూ ఎవ‌రూ చూపించ‌ని స్పెయిన్ లొకేష‌న్స్‌ చూడాల‌న్నా, య‌న్టీఆర్‌లోని కొత్త కోణాన్ని చూడాల‌న్నా, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ను చూడాల‌న్నా మూవీను త‌ప్పకుండా చూడండి' అని అన్నాడు.

ఈ త‌ర‌హా మాట‌లు రామ‌య్యవ‌స్తావ‌య్యా మూవీ క‌లెక్షన్స్‌పై, మూవీను చూడ‌బోయో ప్రేక్షకుల‌పై బ‌లంగా ప్రభావితం చేస్తాయ‌ని టాలీవుడ్ స్పష్టంగా చెబుతుంది. ఒక డైరెక్టర్ ఏమి మాట్లాడ‌కుడ‌దో అది మాట్లాడి మూవీ పూర్తిగా ఫెయిల్యూర్ అయింద‌ని రీలీజ్ అయిన వారం రోజుల‌కే చెప్పడం అనేది మంచి విధానం కాదు. ఇక‌నైన రీలీజ్ అయిన మూవీల గురించి ఎన్ని రోజుల‌కు స్టేట్‌మెంట్ ఇవ్వాలో తెలుకోవాల‌ని అభిమానుల సైతం ఆవేద‌న చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: