కలర్స్ స్వాతిగా పేరుగాంచిన అచ్చమైన తెలుగు అమ్మాయి స్వాతిని ఇష్టపడని తెలుగు సినిమా ప్రేక్షకులు ఉండరు. సినిమాలు చేసినవి చాలా తక్కువే, అయినా టాప్ హీరోయిన్లుతో సమానమైన క్రేజ్ ఈమెకు ఉంది. అటువంటి స్వాతి ఈ రోజు ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చి తన వెనుక ఉన్న నమ్మలేని నిజాలు చెప్పింది. దర్శకుడు హరీష్ శంకర్ హీరో రవితేజా తనను తులసి మొక్క అని ఏడిపిస్తూ ఉంటారని అంటూ ఆమాట విన్నప్పుడల్లా తన ఒళ్ళు మండిపోతుందని అంటు తాను ప్రతి ఏడాది హైదరాబాద్ లో జరిగే ఎక్జిబిషన్ లో జైంట్ వీల్ ఎక్కుతూ చికెన్ ముక్కలు తింటూ అందరితో కలిసి ఎంజాయ్ చెద్దాం అనుకుంటే అక్కడ చేరిన అబ్బాయిలు అంతా కలర్స్ స్వాతి అంటూ కేకలు పెడుతూ ఉంటే తనకు తిక్కరేగి పోతుందని చెప్పింది స్వాతి.

అంతేకాదు నాలుగేళ్ల క్రితం తాను ఫేస్ బుక్, ట్విటర్ ఓపెన్ చేసేన తరువాత ప్రజలలో ఇంత పైత్యం ఉందా అన్న విషయం తనకు తెలిసిందని అంటూ జనానికి తన పై సెటైర్లు వేసి చాన్స్ ఇవ్వడం ఎందుకని తన ఫేస్ బుక్కు, ట్విటర్ క్లోజ్ చేసానని చెపుతోంది స్వాతి. ఒక సినిమా హిట్ అయినా మరో సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా హీరోకు తనకూ లింక్ పెడుతూ మీడియా రాతలు వ్రాస్తుందని. ఆఖరికి విక్రం లాంటి టాప్ హీరో తనకు కలర్స్ స్వాతి అంటే ఇష్టం అని చెపితే ఆ మాటలలో వేరే అర్ధాలు కోలీవుడ్ మీడియా వెతికిందని చెపుతూ ప్రస్తుతం తాను నికిల్ తో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కాబట్టి తామిద్దరికీ ఎదో ఉంది అంటూ గాసిప్పులు వ్రాస్తున్నారని అంటోoది కలర్స్ స్వాతి. ఇక తన పెళ్ళి గురించి మాట్లాడుతూ ప్రస్తుతం టివి లలో, సినిమాలలో నటిస్తున్న అనేకమంది తన సహా నటీనటుల బాధలు చూసాక పెళ్లి అంటేనే తనకు భయం వేస్తోందని చెపుతూ తప్పదు కాబట్టి ఎప్పుడోకప్పుడు పెళ్ళిచేసుకోవాలి కాబట్టి పెళ్లిపై దృష్టి పెడతాను అంటోంది స్వాతి.

తనకు సర్కస్ అంటే విపరీతమైన ఇష్టం అని చెపుతూ తను ఎనిమిదోవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటిలోంచి పారిపోయి సర్కస్ కంపెనీలో చేరిపోదామని అనుకున్నానని ఆ తరువాత డాక్టర్ గా మారిపోదామని అనుకున్నానని అంటూ యిన్ని కోరికలు తనలో ఉన్నాయి కాబట్టే రకరకాల పత్రాలు చేసే నటిగా దేవుడు వరమిచ్చాడు అని అనుకుంటాను అని చెపుతోంది స్వాతి...

మరింత సమాచారం తెలుసుకోండి: