హమ్మయ్య ఎర్రపండులాంటి హీరో మహేష్ బాబు తనకు సరైన జోడి కోసం జామపండులాంటి పిల్లను వెతుక్కున్నాడు. తన సరసన కొత్త భామతో ఇక ఆగను అంటూ ‘ఆగడు’ తో తెరపైకి వస్తున్నాడు. దీంతో మహేష్ బాబు సరసన తొలిసారి నటిస్తూ కొత్త జంట తడాఖా చూపిస్తా అంటోంది ఆ భామ.

అంత చక్కటి పిల్ల ఎవరనుకుంటున్నారా.. అంటే ఆమె అందరికి తెలిసిన పిల్లనే, కాని మహేష్ బాబు సరసన ఇప్పటి వరకు నటించలేదు, తన అందచందాలతో తెలుగు తెరను ఊపుఊపుతున్న హీరోయినే, కాని ఈ కలర్ ఫుల్ కాంబినేషన్ లో రాలేదంతే, ఆమె ఎవరో కాదు పాలబుగ్గల సుందరి తమన్నా. మహేష్ బాబు త్వరలో తెరపైకి వస్తున్న ‘ఆగడు’ సినిమాలో హీరోయిన్ గా బుక్కయింది.

శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీళ్ల ఎంటర్ టైన్ మెంట్ తో వస్తున్న ఈ సినిమాకు అన్ని అదుర్సే. తమన్ సంగీతం అందిస్తున్నారు, ఈ మద్యకాలంలో హిట్లు లేని తమన్నాకు కూడా ఇది బంగారం లాంటి అవకాశమే అంటున్నారు. ఈనెల 25వ తేదీన ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నారు. వినోదం, యాక్షన్ కలగలిపిన చిత్రమిది అంటున్నారు, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: