ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ విన్నా రాష్ట్రవిభజన గురించి లేదంటే పవన్ రాజకీయ ప్రవేశంగురించి. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుకుంటూ రోజులు గడిపేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికలలో వోడి పోయి ఆతరువాత చిరంజీవి ప్రజారా జ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత పవన్ రాజకీయ ప్రస్తావనకు సంబందించిన వార్తలు ఆగిపోయాయి. పవన్ అత్తా రిల్లు బ్లాక్ బస్టర్ హిట్ గా మారిన తరువాత పవన్ థాంక్స్ గివింగ్ మీట్ లో ఇమోషనల్ గా మాట్లాడిన తరువాత రాష్ట్ర విభజన వార్తలతో సమానంగా పవన్ రాజకీయప్రేవేశం వార్తలు ఊపు అందుకున్నాయి. ప్రస్తుతం తెలుస్తున్న వార్తలు బట్టి రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుఫై చాలా అసంతృప్తి గా పవన్ ఉన్నాడని అంటున్నారు.

అయితే ఈ అసంతృప్తిని ప్రజలలోకి ఎలా తీసుకువెళ్ళాలి అనే విషయం ఫై పవన్ తన సన్నిహితులతో ఆలోచిస్తున్నాడని టాక్. అంతే కాదు రాష్ట్ర విభజన నిర్ణయం తెలిసాక పవన్ తీవ్ర అసంతృప్తికి లోను అయి కొద్దిరోజులు తన ఫామ్ హౌస్ లోనే తనకి తాను కొన్ని రోజులు నిరాహార దీక్ష చేసాడు అనే టాక్ కూడ ఉంది. అయితే ఈనిరాహార దీక్ష తన బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేసాడు అనే వాదన కూడా ఉంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ రాష్ట్ర విభజనకు సంబందించి అసెంబ్లీకి తీర్మానం వచ్చే లోపు తన అభిప్రయాన్ని మీడియాకు వెల్లడిస్తాడు అంటూ గత కొన్నిరిజులుగా ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే టాలీవుడ్ నెంబర్ వన్ స్థానానికి అతి చేరువలో ఉన్న పవన్ ప్రస్తుతం ఈ రాజకీయ బురదలో కాలు వేయడని పవన్ రాజకీయ టార్గెట్ రాబోతున్న 2014 ఎన్నికలు కావని, ఆ తరువాత వచ్చే 2019 ఎన్నికలు అని అంటున్నారు. ఏది ఏమైనా రాబోతున్న రోజులలో రాష్ట్ర విభజనతో పాటు పవన్ రాజకీయ ప్రవేశం కూడా రాష్ర్ట భవితవ్యం ఫై పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాసం ఉంది అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: