ఎంట్రీ అవడం ఎంత కష్టమో... ఎగ్జిటవడం అంత సులభం అనుకుంటారు చాలామంది. కానీ సినీ పరిశ్రమలో అదంత ఈజీయేం కాదు. ఎందుకంటే ఆ రంగుల ప్రపంచంలో ఏదో మహత్తు ఉంటుంది. అది తనలో అడుగుపెట్టిన వాళ్లను వశం చేసేసుకుంటుంది. వదిలి వెళ్లాలన్నా వెళ్లనీకుండా చేస్తుంది. అందుకే చాలామంది రిటైర్ అవ్వడానికి ఇష్టపడరు. ఏదో ఒక పని చేసుకుంటూ జీవితాంతం అక్కడే గడపాలనుకుంటారు. అలాంటిది ఇప్పుడిప్పుడే మంచి స్థాయికి చేరుకుంటోన్న ఓ హీరోయిన్ సినిమాలు మానేస్తున్నాను అంటే ఎలా ఉంటుంది!

షాకింగ్ గా ఉంటుంది కదూ! మన ఎక్కడ షాక్ తింటామోనని భయపడిందేమో... సినిమాలు మానేస్తున్నాను అనకుండా, గ్యాప్ తీసుకుంటున్నాను అంటోంది రిచా గంగోపాధ్యాయ. లీడర్ సినిమాలో నటించినప్పట్నుంచీ మంచి పొజిషన్ కి చేరడం కోసం తిప్పలు పడుతూనే ఉందీ పిల్ల. ఇన్నాళ్లకి ఆమె కోరిక ఫలించింది. నాగార్జున లాంటి స్టార్ హీరో పక్కన సోలో హీరోయిన్ గా చాన్స్ దక్కింది. దాంతో ఆమె ఇంకా ఇంకా పై స్థాయికి వెళుతుందని అనుకున్నారంతా. కానీ అంతలోనే ఆమె ఇక సినిమాలు చేయబోవడం లేదని, అమెరికా వెళ్లిపోతుందని ఆమె సన్నిహితుల ద్వారా తెలిసింది. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. 

 అయితే అప్పట్నుంచీ ఈమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందా అని ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. కానీ అసలు విషయాన్ని మాత్రం రిచా చెప్పడం లేదు. తనకు చదువంటే పిచ్చి అని, ఇంకా ఇంచా చదువుకోవాలని ఉందని, అందుకే అమెరికా వెళ్లిపోవాలని ఉందని అంటోంది కానీ నిర్థారించి చెప్పడం లేదు. ఒకవేళ ఆమె నిర్థారించినా... మేడమ్ గారి ఎగ్జిట్ కి కారణం కేవలం చదువే అంటే నమ్మడం కష్టం. అమెరికా నుంచి వచ్చి, ఇక్కడ ఇంత మంచి స్థాయికి చేరుకుంది. నేమ్, ఫేమ్ అన్నీ ఇక్కడ ఉన్నంతగా మరెక్కడా ఆమెకు దొరకవు. అలాంటిది ఇవన్నీ వదిలేసి చదువుకోవడానికి వెళ్లిపోతోందంటే ఎలా నమ్ముతాం. విషయం ఇంకేదో ఉండి ఉంటుంది. ఏంటబ్బా అది?

మరింత సమాచారం తెలుసుకోండి: