ఏమైంది ఈ వేళ అనే తెలుగు మూవీతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు ప‌రిచయం అయిన న‌యా హీరోయిన్ నిషా అగ‌ర్వాల్‌. నిషా అగ‌ర్వాల్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు వ‌చ్చిన‌ప్పటి నుండి పెద్ద హీరోల‌తో కంటే చిన్న హీరోల‌తోనే మూవీల‌ను చేసేందుకు ఇష్టప‌డేది. ముఖ్యంగా వ‌రుణ్ సందేష్ అంటే నిషాకు తెగ ఇష్టం. వీరిద్దరి మ‌ధ్య ఎఫైర్ ఉంద‌ని, ఆ యవ్వారం టాలీవుడ్ పెద్దల వ‌ర‌కూ వెళ్ళింద‌ని చెబుతుంటారు.

ఇదిలా ఉంటే నిషా అగ‌ర్వాల్ ఫిల్మ్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ ప‌డుతుంది. ప‌ర్సన‌ల్ లైఫ్‌లోకి వెడ్డింగ్ కార్డ్ ఎంట‌ర్ అయ్యే సరికి ఈమె లైఫ్ పెళ్ళిబాట ప‌డుతుంది. నిషా అగర్వాల్ ముంబై కి చెందిన కరణ్ వలేచ అనే ఓ బిజినెస్ మాన్ ని ప్రేమిస్తోంది. వీరిద్దరి పెళ్లి డిసెంబర్ 28న ముంబైలో జరగనున్నట్లు అధికారిక స‌మాచారం. త్వరలోనే నిషా అగర్వాల్ నటించిన ‘డీకే బోస్’ రిలీజ్ కానుంది. దీని త‌రువాత మ‌రికొన్ని సినిమాల్లో న‌టించాల్సి ఉంది. మూవీల‌కు ముందుగా ఇచ్చిన క‌మిట్‌మెంట్స్ పూర్తయితే నిషా అగ‌ర్వాల్ సినిమాల‌కు దూరంగా ఉండాల‌నుకుంటుద‌ని కోళీవుడ్ టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: