స‌రైన ఫిజిక్‌తో అంద‌రిని ఎట్రాక్ట్ చేసేవిధంగా క‌నిపించే టాలీవుడ్ హీరోయిన్ రిచాగంగోపాధ్యాయ‌. రిచాగంగోపాధ్యాయ లీడ‌ర్ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చి, వ‌రుస మూవీల‌ను చేసుకుంటూ వెళుతుంది. తెలుగులో మిర‌ప‌కాయ్‌, మిర్చి,సారొచ్చారు వంటి మూవీల‌తో ప్రేక్షకుల‌ను అల‌రించింది. అలాగే త‌మిళ మూవీల‌లోనూ న‌టించి అక్కడ కూడ ఇండ‌స్ట్రీ మ‌న్నన‌ల‌ను అందుకుంది. రిచాకు మాత్రం టాలీవుడ్‌లో బ‌డా హీరోలతో అవ‌కాశాల‌ను చేజిక్కించుకోవాల‌నే త‌ప‌న మ‌రింత‌గా ఉండేది. 

ఎంత ప్రయ‌త్నించినా అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టే,వ‌చ్చి చేతులారా జారిపోతున్నాయి. దీంతో రిచాకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీ మీద‌, టాలీవుడ్ హీరోల మీద అస‌హ‌నం క‌లుగుతుంది. చాలా కాలం టాలీవుడ్ మూవీల‌కు దూరంగా ఉన్న రిచాకు, నాగార్జున భాయ్ మూవీతో అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది. కాని నాగార్జున స‌ర‌స‌న వ‌చ్చిన ఆఫ‌ర్‌కి రిచా సంతోషంగా లేదు. అందుకే భాయ్ ఆడియో ఫంక్షన్‌లోనూ అంత యాక్టివ్‌గా క‌నిపించ‌లేదు. ఇదిలా ఉంటే ఇక‌నుండి ఏ ఫిల్మ్‌లోనూ నేను న‌టించ‌ను అంటూ రిచా స్టేట్‌మెంట్ ఇచ్చింది. కార‌ణం అడిగితే నేను స్టడీస్ కోసం తిరిగి వెళుతున్నా, అవి పూర్తయిన త‌రువాత మ‌ళ్ళీ ఫిల్మ్స్‌లోకి వ‌స్తాను అని ముచ్ఛట్లు చెబుతుంది. ఏదేమైనా రిచాకు మూవీల‌మీద ఇంట్రెస్ట్ లేక తిరిగి ఫారిన్ చెక్కేస్తుంద‌ని టాలీవుడ్ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: