తెలుగు తెర సీతమ్మ అంజలి కెరియర్ ప్రస్తుతం చాల సమస్యలు మధ్య కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ‘సీతమ్మ వాకిట్లో సినిమా సూపర్ హిట్ అయినా ఆ ఇమేజ్ ను అంజలి ఏ మాత్రం కేష్ చేసుకోలేకపోయింది. వరుస పెట్టి ఆమె పై వస్తున్న రూమర్లు దానితో పాటు ఆమె వింత ప్రవర్తన అంజలి పై నెగిటివ్ ఇమేజ్ ను ఏర్పరచడమే కాకుండా, ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ లో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘మసాల’ తప్పించి మరే సినిమా ప్రస్తుతం ఆమె చేతిలో లేవు. ఈ నేపధ్యంలో అంజలి జీవితం పై సినిమా తీయబోతున్న కోలీవుడ్ దర్శకుడు ఈ సినిమాకు సంబంధించి తన ప్రయత్నాలను వేగవంతం చేయడమే కాకుండా అంజలి జీవితం గురించి రాజోలు దగ్గరనుంచి చెన్నై వరకు చాలా లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తున్న వార్తలు అంజలిని విపరీతంగా కలవర పెడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.

అంజలి పిన్ని, బాబాయ్ లతో కలిసి చెన్నై లో ఆమె సినిమా వేషాల కోసం పడిన పాట్లు ఆ సందర్భంలో ఒక కోలీవుడ్ దర్శకుడి చేతిలో అంజలీ పావుగా మారడం ఆ తరువాత ఆమె పిన్ని బాబాయ్ లతో మనస్పర్ధలు రావడంతో పాటు అంజలి జీవితానికి సంబంధించిన అనేక చీకటికోణాలు ఈ సినిమా స్క్రిప్ట్ లో ఉంటాయని సిల్క్ స్మిత జీవితం ఆధారంగా నిర్మింపబడిన డర్టీ పిక్చర్ ఏవిధంగా సంచలనం సృష్టించిందో ఆ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలని కోలీవుడ్ యువ దర్శకుడు చేస్తున్న ప్రయత్నాలకు షాక్ కు గురైన అంజలి ఈ సినిమాను నిర్మించ కుండా ఆపు చేద్దామని తన సాయసక్తులా ప్రయత్నిస్తున్నా అంజలి ప్రయత్నాలకు విఘాతం ఏర్పడడంతో, అంజలి తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతోందనీ, అనే వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా తన జీవితం పై సినిమా తీస్తున్న ఆ యువ కోలీవుడ్ దర్శకుడి ప్రయత్నాలు ఆపడానికి అంజలి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడి సహాయం తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అంజలిని భయపెడుతున్న ఆ చీకటి కోణం నుండి బయట పడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: