సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాక పవన్ ‘అత్తారిల్లు’ చరణ్ క్రియేట్ చేసిన ‘మగధీర’ కలెక్షన్స్ రికార్డును అధికమిస్తుందా లేదా? అనే ప్రశ్నలకు తెర తొలిగింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం పవన్ ‘అత్తారింటికి దారేది’ ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ లో 56 కోట్లు వసూలు చేసి ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలుపుకుని 70 కోట్ల మార్కును దాటిందని వార్తలు వస్తున్నాయి. దీనితో తెలుగు సినిమా రంగంలో ఇప్పటి వరకూ హైయెస్ట్ గ్రాసర్ గా పవన్ అత్తారిల్లు రికార్డు క్రియేట్ చేయడమే కాకుండా సునాయాసంగా ఈ సినిమా 100 కోట్ల మార్కును అందుకుంటుంది అనే ప్రచారాలు జరుగుతున్నాయి.

ఈ వారంలో విడుదల అవుతున్న నాగార్జున ‘భాయ్’ దీపావళికి వస్తున్న హృతిక్ రోషన్ ‘క్రిష్-3’ సినిమాల భవితవ్యం పై పవన్ ‘అత్తారిల్లు’ వంద కోట్ల కల ఆధారపడి ఉందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా భారీ బడ్జె సినిమాగా విడుదల అవుతున్న ‘క్రిష్-3’ సినిమా పై రాష్ట్రంలోని యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండిటి సినిమాల ఉప్పెన ముందు పవన్ ‘అత్తారిల్లు’ కలెక్షన్స్ స్టామినా నిలబడగలిగితే ఇప్పటివరకు తెలుగు సినిమా రంగంలో ఏ హీరో సాధించని వంద కోట్ల మార్కును పవన్ అత్తారిల్లు సాధించడం జరుగుతుంది అని అంటున్నారు.

ఎదిఎమైనా పవన్ ‘అత్తారిల్లు’ చరణ్ ‘మగధీర’ రికార్డును బ్రేక్ చేసినా తిరిగి ఆరికార్డు మెగా కుటుంబంలోనే ఉండి పోవడం యాదృచ్చికం అనుకోవాలి. కలెక్షన్ల రికార్డుల పై నెంబర్ వన్ స్థానాల పై కోరికలు పెట్టుకొని పవన్ కు ఈ రికార్డులు వరించడం పవన్ అదృష్టం అనుకోవాలి....

మరింత సమాచారం తెలుసుకోండి: