నాకు కమిట్ మెంట్ ఇవ్వు అంటూ లీడర్ సినిమాలో రానా వెంటపడిన ప్రియా ఆనంద్, ఇప్పుడు ఇతర భాషల్లో బిజీ అయిపోయింది. మన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా ఎందుకో గానీ మనవాళ్లు ఆ పిల్లను అంతగా ఆదరించలేదు. అందుకే వేరే చోట్ల ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్, కోలీవుడ్లలో అవకాశాలు అందిపుచ్చుకుంది. 
సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా పరిచయమవుతోన్న పెన్సిల్ సినిమాలో ప్రియను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమె స్థానంలోకి మన తెలుగు పిల్ల శ్రీదివ్య వచ్చింది. దాంతో ప్రియను ఎందుకు తీసేశారోనని చాలా అనుమానాలు వచ్చాయి. రకరకాల పుకార్లు మొదలయ్యాయి. అవి కాస్తా ప్రియ చెవిన పడటంతో కంగారుపడి సీన్లోకి వచ్చింది. తనను ఆ సినిమాలోంచి ఎవరూ తీసెయ్యలేదని, పరిస్థితులు అనుకూలించక తానే ఆ చిత్రం చేయలేకపోయానని చెప్పుకొచ్చింది. పెన్సిల్ లో నటించమని మొదట ప్రియనే అడిగారట. ఆమె కూడా చేస్తానని అందట. తీరా అన్నీ రెడీ అయ్యి, సెట్స్ మీదికి వెళ్లే టైమొచ్చేసరికి ప్రియ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉందట. ఎంత ప్రయత్నించినా డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో ఇక సినిమానే వదిలేసుకోవాల్సి వచ్చిందని చెబుతోంది.

అయితే అందరూ అనుకున్నంటున్న విషయం వేరే ఉంది. ప్రకాశ్ పక్కన ప్రియ చాలా పెద్దగా కనిపిస్తోందట. ఇద్దరికీ జోడీ ఏమాత్రం కుదరకపోవడంతో, ఆమెను తప్పించి శ్రీదివ్యను తీసుకున్నారట. ఆ విషయం అందరికీ తెలిసిపోయాక ప్రియ ఎంత కవర్ చేసుకుంటే ఏం లాభం. పాపం ప్రియ! 

మరింత సమాచారం తెలుసుకోండి: