ఆ మ‌ధ్య కాలంలో వ‌ర్మను ప‌బ్లిగ్‌గా తిట్టగ‌లిగే వారు ఎవ‌రైన ఉన్నారంటే త‌నే క‌ర‌ణ్ జోహార్‌. క‌ర‌ణ్‌జోహార్‌కి రాంగోపాల్‌వ‌ర్మకి బాలీవుడ్‌లో ఎప్పటి నుండో గొడ‌వలు జ‌రుగుతూ ఉండేవి. వ‌ర్మ తీసిన ప్రతి మూవీను అట్టర్‌ప్లాప్ అని క‌ర‌ణ్ జోహార్ ప‌బ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చేవాడు. దీనికి వ‌ర్మ కౌంటర్ ఆన్ ది స్పాట్‌లో ఉండేది. 'నా మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అవ్వు, డైరెక్షన్ గురించి తెలుకో' అంటూ ఈ విధ‌మైన స్టేట్‌మెంట్స్ ఇద్దరి మ‌ధ్య కొన‌సాగుతుంటాయి. వీరిద్దరి టాపిక్ బాలీవుడ్‌లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతుంది.

రీసెంట్‌గా డైరెక్టర్ క‌ర‌ణ్‌జోహార్‌, రామ్‌గోపార్‌వ‌ర్మకు క్షమాప‌ణ‌లు చెప్పాడు. 'ఏదైన త‌ప్పు జ‌రిగితే క్షమించు' అని మెసేజ్ పెట్టాడు. వెంట‌నే క‌ర‌ణ్‌జోహార్ ప్రెస్ మీట్ పెట్టి, ఆ మెసేజ్‌ను మీడియా ముందు పెట్టాడు. 'నేను,వ‌ర్మ ఎప్పుడూ గొడ‌వ‌ప‌డలేదు. మేమిద్దం ఎప్పుడూ క‌లిసి ఉంటాం, బాగానే మాట్లాడుకుంటాం. కాని మీడియానే మా ఇద్దరి మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నట్టు క్రియోట్ చేసింది. వాటిని బూతుద్దంలో చూపెడుతున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న నేను ఈ రోజు ఆర్‌.జి.వికి అపాల‌జి చెప్పాను. ఆ మెసేజ్ ఇదిగో' అంటూ మీడియాతో మాట్లాడాడు. దీంతో వ‌ర్మ,క‌ర‌ణ్‌జోహార్‌ల మ‌ధ్య ఎటువంటి బేధాబిప్రయాలు లేవవ‌ని బిటౌన్‌కు స్పష్టమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: