ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీ రిలీజ్ కంటే ముందుగానే నెట్‌లో రిలీజ్ అయి సంచ‌ల‌నం అయింది. ఓ స్టార్‌డం హీరో మూవీకు ఈ విధంగా జ‌ర‌గ‌టంతో యావ‌త్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీ షాక్ అయింది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీకు బ్లాక్‌డే అనే విషాదం ఏమైనా ఉంటే అది ఇదే అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఈ వీడియో అనుకోకుండా బ‌య‌ట‌కు వ‌చ్చింది కాదు అని, పైర‌సీ భూతం అస్సలు కానే కాదు అని అత్తారింటికిదారేది థ్యాంక్యు మీట్‌లో ప‌వ‌న్ బాహాటంగానే చెప్పాడు. ఇదంతా కుట్ర ప్రకార‌మే జ‌రిగింద‌ని, దానికి సంబంధించిన వ్యక్తుల‌ను అవ‌స‌ర‌మైతే తాట‌తీస్తాను అంటూ స‌భాముఖంగా ప‌వ‌న్‌ హెచ్చరించాడు .

ఇదిలా ఉంటే ఈ రోజు పవ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ఎల‌ట్రానిక్ మీడియాకు ఎక్స్‌క్లూజివ్‌గా ఇంట‌ర్వూ ఇస్తున్నాడు. ఆ టెలివిజ‌న్‌లో రాత్రి 9.30 నిముషాల‌కు లైవ్ ఇంట‌ర్వూ స్టార్ట్ అవుతుంది. 'ఇప్పటికే అత్తారింటికిదారేది మూవీకు సంబంధించిన పైర‌సీను అరిక‌ట్టడంలో ఆ మీడియా చాలా ముందు ఉంది, దానికి థ్యాంక్స్' అంటూ ప‌వ‌న్ కూడ చెప్పాడు. ఈ రోజు అదే మీడియాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లైఫ్ ఇంట‌ర్వూ ఉండ‌టంతో ఇందులో ఎన్నో విష‌యాలు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ ఇంట‌ర్వూ స‌మ‌యం కోసం అంద‌రూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: